Miryalaguda : ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కు అపూర్వ స్వాగతం..!
Miryalaguda : ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కు అపూర్వ స్వాగతం..!
భారీగా హాజరైన కాంగ్రెస్ శ్రేణులు
బాణాసంచా, ఆటపాటలతో హోరెత్తించిన కాంగ్రెస్ కార్యకర్తలు
ర్యాలీలో పాల్గొన్న పెద్దలు జానారెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బిఎల్ఆర్ లు
సమిష్టిగా కృషిచేసి మిర్యాలగూడ ని అభివృద్ధి చేస్తాం
– ఎమ్మెల్సీ శంకర్ నాయక్
మిర్యాలగూడ, ( మన సాక్షి ):
ఎమ్మెల్సీగా ఎన్నికైన తొలిసారి మిర్యాలగూడ పట్టణానికి విచ్చేసిన కేతావత్ శంకర్ నాయక్ కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు , నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సీఎల్పీ లీడర్ కుందూరు జానారెడ్డి, ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ( బిఎస్ఆర్) లు వెంట రాగా పట్టణంలోని వై జంక్షన్ నుండి పట్టణంలో భారీ ర్యాలీతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కు చేరుకున్నారు. అడుగడుగునా గజ మాలలతో, బాణాసంచా పేలులతో సృత్యాలు చేస్తూ ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ లో ఎలాంటి గ్రూపు రాజకీయాలు ఉండవని, ఐక్యమత్యంతో ముందుకు పోతామన్నారు. ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతామన్నారు. ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి చెందిన శంకర్ నాయక్ ఎమ్మెల్సీగా గెలుపొందడంతో నియోజకవర్గ అభివృద్ధి మరింత సులభతరం అవుతుందన్నారు.
అందరూ ఐక్యంగా పనిచేస్తూ రాబోయే రోజుల్లో కూడా పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ సామాన్య కార్యకర్తలను గుర్తించి పదవులు కేటాయించడం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుందన్నారు. తనకు రాజకీయ ఓనమాలు నేర్పిన పెద్దలు జానారెడ్డి అడుగుజాడల్లో సామాన్య కార్యకర్త నుంచి డిసిసి అధ్యక్షుడిగా వివిధ హెూదాలలో తాను పనిచేశానన్నారు.
తన కష్టాన్ని గుర్తించి అధిష్టానం తనకు ఎమ్మెల్సీగా పదవి కేటాయించడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఈ ప్రాంతం వాసిగా మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ ఎమ్మెల్యేలతో కలిసి కృషి చేస్తానన్నారు. సామాజిక న్యాయం పాటించటం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని ఇది గుర్తించి ప్రతి కార్యకర్త ఐకమత్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పనిచేయాలని అన్నారు. తనపట్ల ఆదరణ చూపిన ప్రతి కార్యకర్తకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిసి నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, ధీరావత్ సైలాబ్ నాయక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, శాగ జలంధర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్, ముదిరెడ్డి నర్సిరెడ్డి, చిలుకూరి బాలు, రుణాల్ రెడ్డి, మొలాల అమృత రెడ్డి, బంటు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
TG News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రామ పాలన అధికారి పోస్టుల మంజూరుకు ఉత్తర్వులు జారీ..!
-
Rythu : తెలంగాణలో రైతులకు భారీ గుడ్ న్యూస్.. సబ్సిడీ కోసం దరఖాస్తుల ఆహ్వానం..!
-
WhatsApp : మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్.. ఎలా చేస్తారంటే.. బిగ్ అలర్ట్..!
-
Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. స్నేహితురాలిని ఇంటికి పిలిపించిన యువతి.. అత్యాచారం, ఫోటోలు, వీడియోలతో బెదిరింపు..!
-
Komatireddy Venkatreddy : చరిత్రలో నిలిచిపోయే బడ్జెట్.. నల్లగొండకు ప్రధాన కేటాయింపులు..!












