మిర్యాలగూడను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..!

మిర్యాలగూడ పట్టణంలో సక్రమంగా పారిశుధ్య పనులు చేయాలని శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) కోరారు.

మిర్యాలగూడను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..!

మిర్యాలగూడ టౌన్, మనసాక్షి:

మిర్యాలగూడ పట్టణంలో సక్రమంగా పారిశుధ్య పనులు చేయాలని శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) కోరారు. మంగళవారం ఉదయం 5 గంటలకు మిర్యాలగూడ మున్సిపల్ జవాన్లు, కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి అయన మాట్లాడారు.

ALSO READ : Good News : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. ఉచితంగా..!

మిర్యాలగూడ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ,ప్రతిరోజూ పారిశుద్యం పనులు చేయాలని,చెత్త సేకరించే వాహనాలు ప్రతీ వాడకు వెళ్ళాలని ఆదేశించారు.అలాగే ప్రజలతో మమేకమై, ఒకరికొకరు సహకరించుకుంటూ మిర్యాలగూడ పట్టణాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉంచాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరు బాలు పాల్గొన్నారు.