మౌలిక వసతుల కల్పనకు పాటుపడుతా – ఎడ్మ సత్యం

మౌలిక వసతుల కల్పనకు పాటుపడుతా 

కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం,

కల్వకుర్తి, అక్టోబర్ 23 , మన సాక్షి : కల్వకుర్తి మున్సిపాలిటీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పించడానికి నిరంతరం పాటుపడతానని మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ జనరల్ ఫండ్ 5లక్షల నిధుల ద్వారా 13వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ మురికి కాలువ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన పనుల్లో నాణ్యత లోపించకుండా త్వరతగతిన పూర్తి చేయాలని గుత్తేదారుకు సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ రాచోటీ శ్రీశైలం, పిఎసిఎస్ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు బోజిరెడ్డి,సైదులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నూనె శ్రీనివాసులు,నాగేష్ గౌడ్,వార్డు కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.