Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
పండుగలుBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్సిద్దిపేట జిల్లా

భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి..!

భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి..!

అందోలు, మనసాక్షి :

నాగులపంచమి పండగను పురస్కరించుకొని శుక్రవారం ఉదయం మహిళ భక్తులు నూతన వస్త్రాలను ధరించి గ్రామాల్లోని వివిధ ఆలయాల వద్ద ఉన్న పుట్టల వద్దకు వెళ్లి నాగదేవతలకు ఆవుపాలు పోసి అందరిని చల్లంగా చూడుతల్లి అంటూ నాగదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.

పూలు , పళ్లు ఫలహారాలను నైవేద్యంగా సమర్పించారు. జోగిపేట పట్టణంలోని శోహరబ్‌ క్లబ్‌ వద్ద, రాజరాజేశ్వర దేవాలయం, ఎంపీడీఓ కార్యాలయం వద్ద, శివపార్వతుల దేవాలయాల వద్ద ఉన్న పుట్టల వద్దకు పెద్ద ఎత్తున మహిళ భక్తులు తరలివచ్చి పుట్టలలో పాలుపోశారు. జోగిపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌ చిట్టిబాబు నాగదేవతలకు పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన జోగిపేట పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాగుల పంచమి రోజున నాగదేవతలకు పాలు పోయడం ద్వారా సర్ప దోశాలు తొలగటంతో పాటు నాగదేవతల కరుణకటాక్షాల ఉంటాయన్నారు.

ALSO READ : 

Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. 50 కంపెనీలతో మెగా జాబ్ మేళ.. టెన్త్ పాస్ అయిన వారికి కూడా అవకాశం..!

Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!

Good News : ప్రభుత్వం గుడ్ న్యూస్.. మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత కుట్టు మిషన్ పథకం, దరఖాస్తు చేసుకోండి ఇలా..!

మరిన్ని వార్తలు