Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
పండుగలుBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

KOMATIREDDY VENKATREDDY : నల్గొండ జిల్లా మతసామరస్యానికి పెట్టింది పేరు.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..! 

KOMATIREDDY VENKATREDDY : నల్గొండ జిల్లా మతసామరస్యానికి పెట్టింది పేరు.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..! 

నల్లగొండ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మతసామరస్యానికి పెట్టింది పేరని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ఆయన నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గాలో పవిత్ర రంజాన్ సందర్భంగా ప్రార్థనలు జరిపిన ముస్లింలతో కిలిసిన అనంతరం జిల్లాలోని ముస్లిం ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో ముస్లింల పాత్ర మరువలేనిదని అన్నారు. దేశాభివృద్ధికి ఎంతోమంది ముస్లింలు కృషి చేశారని, అందులో అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా, సైంటిస్ట్ గా చేసిన సేవలు మరువలేనివని అన్నారు. నల్గొండ జిల్లా మతసామరస్యానికి పేరని, హిందూ ముస్లింలు అందరూ కలిసి నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేసుకొనేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.

నల్గొండలో శాంతిభద్రతలు బాగుండాలని, హిందూ, ముస్లింలు అందరూ కలిసిమెలిసి ఉండాలని అన్నారు. నల్గొండ పట్టణంలోని దర్గాలు ఈద్గాల అభివృద్ధికి తాను గత 25 సంవత్సరాల నుండి కృషి చేస్తున్నానని తెలిపారు. ఇక్కడి ఈద్గా తెలంగాణలోనే అతిపెద్ద ఈద్గా అన్నారు. ఇటీవల నల్గొండలో నిర్వహించిన ఇస్తేమాలో సుమారు 40, 50 వేల మంది పాల్గొన్నా ఎలాంటి సమస్య లేకుండా తాగునీరు, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.

ముఖ్యంగా లతీఫ్ సాబ్ దర్గా కు ప్రతి సంవత్సరం నిర్వహించే ఉర్సు ,ఇతర ఉత్సవాల సందర్భంగా లక్షల మంది వస్తారని, పెద్దవారు, ముసలివారు గుట్ట ఎక్కలేరని, దీన్ని దృష్టిలో ఉంచుకొని లతీఫ్ సాబ్ దర్గాకు 100 కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్ నిర్మిస్తున్నామని , టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.

లతీఫ్ షాప్ గుట్ట నుండి బ్రహ్మంగారి గుట్ట వరకు రోప్ వే నిర్మిస్తున్నామని, బ్రహ్మంగారి గుట్టకు కూడా వేరే ఘాట్ రోడ్ వేయిస్తున్నామని, 500 కోట్లతో కొత్త బైపాస్ రోడ్ టెండర్లు వేయడం జరిగిందని, వారం రోజుల్లో పనులు మొదలవుతున్నాయన్నారు.

నల్గొండలో ముస్లింల సంక్షేమం, అభివృద్ధి లో భాగంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ, మెడికల్ కళాశాల, కలెక్టరేట్ తదితర ప్రభుత్వ సంస్థలలో ఔట్సోర్సింగ్, కాంటాక్ట్ పద్ధతిపై అర్హులైన ముస్లిం అభ్యర్థులను నింపేందుకు 10 శాతం రిజర్వేషన్ కల్పించేలా జిల్లా కలెక్టర్ కు ఇదివరకే ఆదేశించడం జరిగిందని ఆయన వెల్లడించారు.

దీంతోపాటు పేద ముస్లింలకు ఇండ్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, నల్గొండ పట్టణం సమీపంలో పేదవారికి ఇండ్ల నిర్మాణానికి భూమిని గుర్తించడం జరిగిందని, ప్లాట్లు లేని వారికి ప్లాట్లు ఇచ్చి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తామని, ప్లాట్లు ఉంటే నేరుగా ఇల్లు కట్టించడం జరుగుతుందని ఆయన చెప్పారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ జిల్లాలో హిందూ, ముస్లింలందరూ సోదర భావం తో ఉండాలని కోరుతూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.అదనపు కలెక్టర్ జే .శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

MOST READ :

  1. Ration Cards : రేషన్ కార్డు దరఖాస్తుదారులకు బిగ్ ట్విస్ట్.. ఆ తర్వాతే కార్డుల పంపిణీ.. లేటెస్ట్ అప్డేట్..!

  2. CM Revanth Reddy : ఇది మామూలు పథకం కాదు.. దీనిని రద్దు చేసే ధైర్యం ఏ సీఎం చేయలేడు..!

  3. Hyderabad : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపర్ న్యూస్..!

  4. Ration Cards : ట్రై కలర్స్ లో రేషన్ కార్డులు.. రేపటి నుంచి సన్న బియ్యం పంపిణీ..!

  5. TG News : సర్పంచ్ ఎన్నికల డేట్ ఫిక్స్.. షెడ్యూల్ ప్రకటించిన తెలంగాణ సర్కార్..!

మరిన్ని వార్తలు