Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

బతికుండగానే అధికారులే.. చంపేశారు..!

బతికుండగానే అధికారులే.. చంపేశారు..!

కరీంనగర్, మనసాక్షి :

బతుకు భారమైన వృద్ధులకు చేయూత అందించడానికి ప్రభుత్వం పింఛను అందిస్తోంది. అయితే కరీంనగర్ జిల్లాలో అధికారుల తప్పిదం కారణంగా ఓ వృద్ధుడు ఆ పింఛనుకు నోచుకోవడం లేదు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొరటపల్లి గ్రామానికి చెందిన చిలుముల లింగయ్య 66 అనే వృద్ధుడికి వస్తున్న పింఛను అధికారులు తప్పిదం వల్ల నిలిచిపోయింది.

గత ప్రభుత్వ హయాంలో పింఛను పొందిన ఆ వృద్ధుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే అధికారులు పింఛన్ ఆపివేసినట్లు తెలిపారు. దింతో తన పింఛన్ డబ్బులు ఎందుకు రావడం లేదంటూ సంబంధిత అధికారులను నిలదీయగా అధికారులు చెప్పిన మాటలకూ ఆ వృద్ధుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యడు. ఇంతకు ఆ అధికారులు తనతో ఎం చెప్పారంటే.. ఇటీవలే మరణించిన లిస్టులో తన పేరు వచ్చిందని, లింగయ్య నీవు చనిపోయావంటూ.. నీ పేరును తొలగించడం జరిగిందని కుండా బద్దలు కొట్టినట్లుగా అధికారులు లింగయ్య కు చెప్పారంట.

ఇక చేసేది ఏమి లేక అధికారుల తప్పిదంతో పోయిన పింఛన్ మళ్ళీ తెచ్చుకునేందుకు కొన్ని నెలలుగా దరఖాస్తులు పెడుతూ.. ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదన్నారు. పింఛను రాక కుటుంబ పోషణ భారమైందని విన్నవించారు. అధికారుల తప్పిదంతో గ్రామంలో చాలా మంది వృద్ధుల పరిస్థితి ఇలాగే ఉందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ కుటుంబాన్ని రోడ్డున పడేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుని, మరల ఫించన్ మంజూరు చేయాలనీ అధికారులను కోరారు.

MOST READ : 

  1. District collector : కొడుకు తిండి పెట్టడం లేదని జిల్లా కలెక్టర్ కు వృద్ధురాలు ఫిర్యాదు.. స్పందించిన జిల్లా కలెక్టర్ ఏం చేసిందంటే..!

  2. Rythu Bima : 18 ఏళ్లు నిండిన వారికి ఐదు లక్షల బీమా.. రెండు రోజులే గడువు.. కావలసిన పత్రాలు ఇవీ..!

  3. Blood Group : మీకు ఆ బ్లడ్ గ్రూప్ ఉంటే స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ.. అధ్యయనంలో నిర్ధారణ..!

  4. TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. వారందరికి టికెట్లపై రాయితీ..!

  5. Croma : స్వాతంత్ర్య దినోత్సవ సేల్.. ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్‌పై 50% వరకు భారీ డిస్కౌంట్..!

మరిన్ని వార్తలు