Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

NARAYANPET : అధికారులు వసతి గృహాలలో రాత్రి భోజనం విద్యార్థులతో కలిసి చేయాలి.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..!

NARAYANPET : అధికారులు వసతి గృహాలలో రాత్రి భోజనం విద్యార్థులతో కలిసి చేయాలి.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శుక్రవారం డెంగ్యూ, ఇతర విష జ్వరాల పట్ల అధికారుల తో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. డెంగ్యూ విశ జ్వరాల కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాలలో ఎంపీడీఓ, మెడికల్ ఆఫీసర్లు సమన్వయంతో దోమల నివారణకు ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు.

ఆగస్టు నెలలో జిల్లాలోని వివిధ మండలాలలో నమోదైన డెంగ్యూ కేసుల పై ఆమె ఆరా తీశారు. రెగ్యులర్ గా ఫాగింగ్ చేయించాలన్నారు. ఎంపీడీవోలు ఎంపిఓలు మెడికల్ ఆఫీసర్లు వారానికోసారి సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని విష జ్వరాల నివారణకు ప్రత్యేక కార్యచరణ రూపొందించుకోవాలన్నారు.

పట్టణ ప్రాంతాల్లోనూ మున్సిపల్ కమిషనర్లు సమన్వయం చేసుకోవాలన్నారు. జిల్లాలో తప్పనిసరిగా ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం నిర్వహించాలని ఆమె సూచించారు. విష జ్వరాల కేసుల వివరాలను మెడికల్ ఆఫీసర్లు ఆయా మండలాల ఎంపీడీవో ఎంపీవో లకు సమాచారం ఇవ్వాలన్నారు.

డెంగ్యూ కేసులు ఎక్కువగా చిన్నారులకే వచ్చాయని, అప్రమత్తత చాలా అవసరమన్నారు. మండల ప్రత్యేక అధికారులు క్రమం తప్పకుండా తమ పరిధిలోని వసతి గృహాలను తనిఖీ చేసి తాగునీటి, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించాలన్నారు. నిధుల కొరత ఏమీ లేదని మరమ్మతు పనులకు ప్రతిపాదించి చేయించాలన్నారు.

జిల్లాలోని 37 వసతి గృహాలలో ఒక్క ఫుడ్ పాయిజన్, పాముకాటు కేసులు నమోదు కాకుండా ప్రత్యేక అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే సమస్యలతో హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగే ఆస్కారం లేకుండా ముందస్తు గా సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు.

వసతి గృహాలలో నీటి గుంతలు ఉండకుండా చూడాలని, వసతి గృహాలకు తాగునీటి సరఫరా లేకపోతే వెంటనే మిషన్ భగీరథ కనెక్షన్లు ఇప్పించాలన్నారు. మండలాల వారిగా ప్రత్యేక అధికారులు ఆగస్టు నెలలో ఎన్ని వసతి గృహాలు తనిఖీ చేశారనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి , వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలో కిచెన్ గార్డెన్, న్యూట్రి గార్డెన్ తప్పక ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు.

అధికారులు వసతి గృహాలలో రాత్రి భోజనం విద్యార్థులతో కలిసి చేయాలని, పని దినాలలో కాకుండా సెలవు దినాలలో వసతి గృహాలను పరిశీలించాలని సూచించారు. సెప్టెంబర్ నెలలో వసతి గృహాల విజిట్ కు సంబంధించిన ఫార్మాట్ రెండు రోజులలో వస్తుందని, ఆ ఫార్మాట్ ప్రకారం ప్రత్యేక అధికారులు వసతి గృహాలను తనిఖీ చేయాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను పూర్తిగా నిషేధించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. నారాయణపేట, మక్తల్, కోస్గి మున్సిపాలిటీలలో మహిళా శక్తి క్యాంటీన్లను రెండు రోజులలో ఏర్పాటు చేసేందుకు ఆయా మున్సిపల్ కమిషనర్లు అన్ని సిద్ధం చేయాలని చెప్పారు.

సెర్ఫ్ కార్యక్రమాల అమలు తీరు రాష్ట్రస్థాయిలో జిల్లా ర్యాంక్ చివరి స్థానంలో ఉండడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. శ్రీనిధి మహిళా సంఘాలు ఎంటర్ప్రైజెస్, ఫుడ్ ప్రాసెసింగ్, మిల్చ్ అనిమల్స్, పౌల్ట్రీ, మదర్ యూనిట్ ఇంప్రూవ్ చేయాలన్నారు. అలాగే మిల్క్ పార్లర్, సిఎన్ సి, మొబైల్ ఫిష్, మీసేవ కేంద్రాల ఏర్పాట్ల గురించి కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. కొత్త మహిళా సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

సెప్టెంబర్ 15 వరకు ప్రతి విద్యార్థికి రెండు జతల స్కూల్ యూనిఫామ్ తప్పనిసరిగా ఉండాలన్నారు. యూనిఫామ్ లేని విద్యార్థి అంటూ కనిపించరాదన్నారు. చివరగా జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ మాట్లాడుతూ పంచాయతీ ఓటరు జాబితా రూపకల్పన పగడ్బందీగా చేపట్టాలని ఎంపీడీవోలు ఎంపిఓలకు సూచించారు.

ఓటరు జాబితా రూపకల్పన విషయమై కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 21న పంచాయతీలలో తుది ఓటరు జాబితా ప్రచురించాలని తెలిపారు. ఎలక్ట్రోల్ ప్రిపరేషన్ పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. సెప్టెంబర్ 16 నుంచి మళ్లీ ప్రజా పాలన కార్యక్రమం కొనసాగుతుందని, ప్రజాపాలనలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.

మూడు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమీక్ష సమావేశంలో ట్రైనీ కలెక్టర్ గరిమానరుల, డిఆర్డిఓ మొగులప్ప, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, అడిషనల్ డిఆర్డిఓ అంజయ్య, పి ఆర్ ఈ పి ఆర్ ఈ ఈ హిర్యా నాయక్, డి ఎం ఓ బాలమణి, సిపిఓ జీవరత్నం, డిపిఆర్ఓ ఎం ఏ రషీద్, జి సి డి ఓ పద్మనళిని మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

Runamafi : కుటుంబ నిర్ధారణ సరే.. వారికి రుణమాఫీ ఎప్పుడంటే..!

District SP : పగలు, రాత్రి 24/7 పెట్రొలింగ్.. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశం..!

NALGONDA : రుణమాఫీలో కాలయాపన చేస్తే రైతులు తగిన బుద్ధి చెబుతారు.. నల్గొండ కలెక్టరేట్ ఎదుట సిపిఎం ధర్నా..! 

Runamafi : రుణ మాఫీ కోసం రేషన్ కార్డులేని రైతులు దరఖాస్తు చేసుకోవాలి..!

మరిన్ని వార్తలు