పల్లె దవాఖానకు కరెంటు కష్టాలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి మండలానికి మూడు నాలుగు పల్లె దవాఖాణ లు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. కానీ చందుర్తి మండలంలోని మర్రిగడ్డ గ్రామంలో ఊరు చివర నిర్మించిన పల్లె దవాఖాణ ను 16 లక్షలు వెచ్చించి నిర్మించారు.

పల్లె దవాఖానకు కరెంటు కష్టాలు

ప్రారంభానికి నోచుకోని పల్లె దవాఖాన

రుద్రంగి,  (మనసాక్షి)

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి మండలానికి మూడు నాలుగు పల్లె దవాఖాణ లు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. కానీ చందుర్తి మండలంలోని మర్రిగడ్డ గ్రామంలో ఊరు చివర నిర్మించిన పల్లె దవాఖాణ ను 16 లక్షలు వెచ్చించి నిర్మించారు.

 

నిర్మాణం పూర్తి చేసుకొని సంవత్సరం కావస్తున్నా దవాఖాణ ప్రారంబానికి నోచుకోలేదు పల్లె దవాఖాణ ఎప్పుడు ప్రారంభిస్తారోనని గ్రామ ప్రజలు ఎంతో ఆశగా ఏదురు చూస్తున్న ప్రజలకు ఎందుకు ప్రారంబానికి నోచుకుంటలేదో అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. విషయం ఏంటని ఆరా తీస్తే ఈ దవాఖాణ కి కరెంటు సరఫరాలేదు అని తెలిసింది.

 

ALSO READ : 

  1. సూర్యాపేట : జిల్లా కలెక్టర్ ను కుర్చీలో కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ తర్వాత..!
  2. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలుస్తాం
  3. TELANGANA :  బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేసిన కేసీఆర్
  4. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!
  5. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!

 

ఈ దవాఖాణ ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమై మర్రిగడ్డ గ్రామ సర్పంచి జలపతి రెడ్డిని వివరణ కోరగా సంవత్సరం క్రిందటనే దవఖాన పూర్తి చేశారు సంతోషమే కానీ దవాఖాణ కి కరెంటు సరఫరా లేదు కరెంటు కనెక్షన్ కోసం సెస్ అధికారులను సుమారు 1,50,000 ఎస్టిమేషన్ వేసి ఈ డబ్బులు గ్రామపంచాయతీ చెల్లించాలని తెలిపారన్నారు.

 

గ్రామపంచాయతీలో నిధులే లేవు మా గ్రామ పంచాయతీ నుండి మేం ఎలా కడతాము ఇప్పటివరకు మా సొంత డబ్బులనే వెచ్చించి పనులు చేపిస్తున్నాము ఇప్పటికి బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయని గ్రామ సర్పంచి జలపతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.