Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లావిద్య

Valigonda | పాపం.. ఆ చిన్నారులు, మధ్యాహ్నం వస్తులే..!

Valigonda | పాపం.. ఆ చిన్నారులు, మధ్యాహ్నం వస్తులే..!

వలిగొండ , మన సాక్షి:

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజుపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఈ నెల 12న పాఠశాలల ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ప్రభుత్వం పాఠశాలలోనే మధ్యాహ్న భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఆ పాఠశాలలో నేటికీ 13, 14 రోజులు కావస్తున్నా.. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనం వండి పెట్టడం లేదు. చిన్నారులు మధ్యాహ్నం పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

 

ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టడంలో శ్రద్ధ వహించకపోవడంతో, పిల్లలకి ఇబ్బంది అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. మధ్యాహ్నం సమయంలో చిన్నారులను కొంతమంది ఇంటికి తీసుకెళ్లి అన్నం తినిపించుకొని తీసుకొస్తున్నారని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

 

Also Read : Gruhalakshmi scheme : గృహలక్ష్మీ పథకంలో ప్రభుత్వం ఇచ్చే రూ. 3 లక్షలు రావాలంటే.. ఇవి ఉండాల్సిందే..!

 

అదేవిధంగా పాఠ్యాంశాలు బోధించడానికి ఒక్కరే టీచర్ ఉండడం వలన.. అతను వివిధ కారణాల వల్ల సెలవు పెట్టడంతో ఆరోజు పిల్లలకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. అధికారులు స్పందించి మరొక ఉపాధ్యాయున్ని ఏర్పాటు చేయాలని, తల్లిదండ్రులు గ్రామ ప్రజలు కోరుతున్నారు.

 

Also Read : Forest Jobs : టెన్త్, ఇంటర్ అర్హతతో అటవీ శాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం..!

 

ఇట్టి విషయంపై విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి మధ్యాహ్న భోజనాన్ని, అదేవిధంగా మరొక ఉపాధ్యాయుని నియమించాలని కోపరాజు పల్లి గ్రామ ప్రజలు మీడియాతో తెలియజేసుకున్నారు.

మరిన్ని వార్తలు