Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లామహబూబ్‌నగర్

PDS : నారాయణపేటలో  పిడిఎస్ బియ్యం పట్టివేత..!

నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామంలో మంగళవారం టాస్క్ ఫోర్స్, రూరల్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి దామరగిద్దకు చెందిన సబేరా బేగం ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 10.5 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించామని రూరల్ ఎస్సై సతీష్ రెడ్డి తెలిపారు.

PDS : నారాయణపేటలో 
పిడిఎస్ బియ్యం పట్టివేత..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :-

నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామంలో మంగళవారం టాస్క్ ఫోర్స్, రూరల్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి దామరగిద్దకు చెందిన సబేరా బేగం ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 10.5 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించామని రూరల్ ఎస్సై సతీష్ రెడ్డి తెలిపారు.

డిటి పంచనామా నిర్వహించి, సబేరా బేగం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పేదల కోసం పంపిణీ చేసే పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచడం, రవాణా చేయడం లేదా ఇతరులకు విక్రయించడం వంటి చర్యలు చట్ట విరుద్ధమని హెచ్చరించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రజలు ఇలాంటి అక్రమాల గురించి సమాచారం ఉన్నట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. నేరాలను అరికట్టడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని ఎస్ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు