Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజాతీయం

Nalgonda : కొత్త తరహాలో పిడిఎస్ దందా.. చేదించి, భారీగా పట్టుకున్న నల్లగొండ పోలీసులు..!

Nalgonda : కొత్త తరహాలో పిడిఎస్ దందా.. చేదించి, భారీగా పట్టుకున్న నల్లగొండ పోలీసులు..!

నల్లగొండ, మన సాక్షి :

పిడిఎస్ అక్రమ రవాణా కొత్త తరహాలో సాగుతోంది. పోలీసుల కళ్ళుగప్పి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. దానిని అతి చాకచక్యంగా పోలీసులు చేదించి.. ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న భారీగా పిడిఎస్ బియ్యంను నల్గొండ పోలీసులు పట్టుకున్నారు.

పాలిష్ చేసిన పిడీ ఎస్ బియ్యంను ఆంద్రప్రదేశ్ నుండి కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాజస్తాన్ లకు రవాణా చేస్తున్న నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ శరత్చంద్ర పవర్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అరెస్టు చేసిన నిందితుల నుండి 18 లక్షల విలువ గల 504.40 క్వింటాల పిడిఎస్ రైస్, (02)లారీ స్వాదీనం సాజీనం చేసుకున్నట్లు తెలిపారు.

జిల్లాలో పిడియస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవనీ హెచ్చరించారు.నమ్మదగిన సమాచారం మేరకు పిడిఎస్ బియ్యంను ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తున్నారు.

అనే సమాచారం మేరకు జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు పోలీస్లు పౌర సరఫరాల అదికారులతో కలసి వాడపల్లి గ్రామ శివారులోని ఆర్టిఏ బార్డర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేయుచుండగా ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో ఆంద్రప్రదేశ్ వైపు నుండి తెలంగాణ వైపునకు కె ఏ56 2700 నెంబర్ గల ఒక లారి నందు 245.40 క్వింటాల పిడిఎస్ రైస్ ను తరలిస్తుండగా పట్టుబడి చేయడం జరిగినదనీ ఇట్టి రైస్ ను 30 కేజీల బరువు గల 818 ప్లాస్టిక్ సూపర్ బ్యాగ్ లలో నింపి తరలిస్తున్నారని తెలిపారు.

అనంతరం పౌరసరఫరాల డిప్యూటీ తహశీల్దార్ జావీద్ వాడపల్లి పోలీస్ లు సంయుక్తంగా కే ఏ56 2700 నెంబర్ గల లారిని, పిడిఎస్ రైస్ ను స్వాదిన పరుచుకోవడం జరిగినదన్నారు. అలాగే ఇదే క్రమంలో దాదాపు 8 లక్షల విలువ గల 250 కింటాల్ అక్రమ పిడియస్ బియ్యంను లారీ నెంబర్ జీజే 25 యు 2727 గల వాహనంలో బాపట్ల నుండి గుజరాత్ కి తరలిస్తున్న పిడిఎస్ రైస్ ను పౌరసరఫరాల అదికారుల సమక్షంలో స్వాదినపరుచుకొని డ్రైవరు భీమయ్యను అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుందన్నారు.

నేరస్తులు బాపట్ల పట్టణానికి చెందినచీమకుర్తి సుధాకర్ , కర్ణాటకకు చెందిన సయ్యద్ సలావుద్దీన్ గుంటూరుకు చెందిన అశోకు లను అరెస్టు చేశామన్నారు.

నిందితుడు చీమకుర్తి గత కొన్ని సంవత్సరాలుగా బాపట్ల లోని తన, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర అయ్యప్ప ట్రేడర్స్ నందు రైతుల నుండి సేకరించిన వడ్ల తో పాటు పి డియస్ రైస్ ను గుంటూరు, బాపట్ల నరసరావు పేటలలో తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు.

తన మిల్లులో వాటిని సన్న బియ్యం వలె పాలిష్ చేసిన తదుపరి అట్టి బియ్యాన్ని వాటిని 25, 30 కేజీ ల ప్లాస్టిక్ సూపర్ బ్యాగ్లలో పార్సిల్ చేసి, వాటికి సంబందించి నకిలీ బిల్లులు కూడా తయారు చేసి, ఎవరికి అనుమానం రాకుండా తనకు తెలిసిన అశోక్ అనే గుంటూర్ కు చెందిన ఏజెంట్ ద్వారా నెలకు 10 నుండి 12 లారీల లోడ్లులను ఆంద్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ మరియు రాజస్తాన్ లకు రవాణా చేస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్నాడునీ తెలిపాడు.

ఇదే క్రమంలో కర్ణాటక రాష్ట్రనికి చెందిన సయ్యద్ సలావుద్దీన్ యొక్క కేఏ56 2700 నెంబర్ గల లారీ లో లోడ్ చేసి అట్టి వాటిని అశోక్ మరియు సుధాకర్ లు తెలంగాణ మీదుగా ముంబాయి కి తరలించే క్రమంలో అట్టి పీడీ యోస్ రైస్ లోడ్ గల లారిని పట్టుబడి చేసి, కేసు నమోదు చేయడం జరిగినదనీ తెలిపారు.

ఈ కేసును చాకచక్యంగా పట్టుబడి చేసిన మిర్యాలగూడ డి.ఎస్.పి రాజ శేఖర్ రాజు పర్యవేక్షణలో, మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు ఆద్వర్యంలో వాడపల్లి ఎస్సై వారి సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

LATEST NEWS : 

మరిన్ని వార్తలు