Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండలో PIB వర్క్ షాప్.. సమాజంలో జర్నలిజం నాలుగవ స్తంభం..!

Nalgonda : నల్గొండలో PIB వర్క్ షాప్.. సమాజంలో జర్నలిజం నాలుగవ స్తంభం..!

నల్లగొండ, మన సాక్షి.

సంచలన వార్తలకి ప్రాధాన్యం ఇవ్వకుండా సమాజానికి అవసరమయ్యే వార్తలకు సముచిత స్థానం కల్పిస్తే సమాజంలో మార్పుకు మనం నాంది కావచ్చు. ప్రతీ రోజు నిరంతరం మనం ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా జర్నలిజంలో నిరంతరం మనల్ని మనం నవీకరించుకోవాలని నల్లగొండ జిల్లా అదనపు పాలనాధికారి పూర్ణ చంద్ర అన్నారు.

గురువారం స్థానిక అంబేద్కర్ భవన్ లో జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన వార్తలాప్ – వర్క్ షాప్ లో ముఖ్య అతిథిగా జిల్లా అదనపు పాలనాధికారి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు పాలనాదికారి. పూర్ణచంద్ర మాట్లాడుతూ నేడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మనల్ని మనం నవీకరించుకుంటూ, సమాజంలో 4వ స్తంభం గా మీడియా తన పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తే సమాజంలో మంచి మార్పును మనం చూడవచ్చన్నారు.

ప్రజాభిప్రాయ ప్రకారం నిజ నిర్ధారణ చేసుకొని వార్తలు రాస్తే బాగుంటుంది. పిఐబి లాంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయం నేడు మన మధ్యకు వచ్చి జిల్లా స్థాయిలో వర్క్ షాప్‌లను నిర్వహిస్తోందని, ఇందుకు పిఐబి బృందాన్ని అభినందిస్తున్నానన్నారు.
పోషణ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ మన దైనందిన జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, మనం తినాల్సిన వాటి గురించి వివరంగా తెలియజేసేలా ఉందని, ఈ ఎగ్జిబిషన్ ని సాధ్యమైనంత వరకు అందరూ ఒకసారి తిలకించి అవగాహన పెంచుకోవాలని కోరారు.

ఇంతకు ముందు నేరాలలో బాధితులు, నేరస్థులు ఉండేవారు. కానీ ఇప్పుడు సైబర్ క్రైమ్ లో నేరస్థులు ఎక్కడో ఉండి మనకు చేయాల్సిన నష్టం చేస్తూనే ఉంటారు. రాష్ట్రంలో ప్రతీ రోజూ సుమారు రూ.5-6 కోట్ల మధ్య సైబర్ మోసాల వల్ల నష్టపోతున్నారని టి.లక్ష్మి నారాయణ, సైబర్ క్రైమ్ డిప్యూటీ ఎస్పీ అన్నారు.

సైబర్ క్రైమ్ బాధితులు ఎక్కువగా ఉన్నత విద్యా వంతులే, 90 శాతం కి పైగా వారే ఉన్నారు. ప్రతీ జిల్లా లో సైబర్ క్రైమ్ కి సంబంధించి సైబర్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది.సైబర్ క్రైమ్ జరిగిన గోల్డెన్ అవర్ లో ఫిర్యాదు చేస్తే మనం సత్వర న్యాయం జరిగేలా చూడవచ్చు,కాలయాపన చేస్తే చాలా వరకు మనం బాధితులకు న్యాయం చేయలేము.

ఈ సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పాత్రికేయుల మిత్రులదే. ఎన్ సి ఆర్ పిపోర్టల్ / 1930 ద్వారా సైబర్ మోసాన్ని తెలియజేయవచ్చన్నారు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధీనంలోని పత్రికా సమాచార కార్యాలయం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పని చేస్తోందని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు, మీడియా కు చేరవేయడంలో పత్రికా సమాచార కార్యాలయం ముఖ్య పాత్ర పోషిస్తోందని పి ఐ బి డిప్యూటీ డెరైక్టర్ డా.మానస్ కృష్ణకాంత్ తన స్వాగతోపన్యాసం లో తెలిపారు.

జర్నలిస్టులు నైతిక విలువలు పాటిస్తూ, కచ్చితమైన వార్తలను సేకరించి ప్రజలకు మరిన్ని మంచి వార్తలు అందేలా చూడాలని, మారుతున్న ధోరణులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలని ఈ వర్క్ షాప్ కి వక్త గా హాజరైన దిలీప్ కుమార్ రెడ్డి అన్నారు. వృత్తి ధర్మం పాటించి వార్తలు అందించండి, జర్నలిజానికి పూర్వ వైభవం అందించాల్సిన భాధ్యత మనందరిపైనే ఉందన్నారు.

డిజిటల్ యుగంలో మనం కేవలం వార్తలే కాకుండా మనం వాడే మొబైల్ ఫోన్లు తరచూ అప్డేట్ చేస్తూ ఉండాలని, ఈ సైబర్ యుగంలో మనం డేటా ను సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని గురించి మరో వక్త సి డాక్ సైంటిస్ట్ జగదీప్ బాబు తెలియజేశారు.

పోషణ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ గురించి నల్లగొండ జిల్లా ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి కోటేశ్వర రావు వివరించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్ , పత్రికా సమాచార కార్యాలయం అందిస్తోన్న సేవల గురించి ఆయన వివరంగా తెలియజేశారు.

పిఐబి పనితీరు గురించి పిఐబి అధికారులు గాయత్రి, శివచరణ్ రెడ్డి వివరణాత్మకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పిఐబి అధికారులు, సిబ్బంది, సిబిసి సిబ్బంది, డి.పి.ఆర్.ఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు