డ్రగ్స్ సరఫరా చేస్తున్న తండ్రి, కొడుకులు.. అరెస్టు చేసిన పోలీసులు..!
డ్రగ్స్ సరఫరా చేస్తున్న తండ్రి, కొడుకులు.. అరెస్టు చేసిన పోలీసులు..!
మేడ్చల్ మల్కాజిగిరి , మనసాక్షి
డ్రగ్స్ సరఫరా చేస్తున్న తండ్రి కొడుకులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నేరేడ్ మెట్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ రాచకొండ కమీషనరేట్ బాలపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హనీఫ్ షా, సిద్ధిక్ షా తండ్రి కొడుకులు.. ఇద్దరు కలిసి నగరానికి హెరాయిన్ తెచ్చి ఇక్కడ సరఫరా చేస్తున్నారు.
మాకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బాలాపూర్ పోలీసులతో కలిసి మహేశ్వరం ఎస్.ఓ.టి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి నిషేధిత హెరాయిన్ 100 గ్రాములు, 13 వేల నగదు, 3 సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నాము. వీటి విలువ బహిరంగ మార్కెట్ లో 12 లక్షల రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమీషనర్ తెలియజేసారు.
పేద కుటుంబానికి చెందిన ఈ కుటుంబం మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి నగరానికి వచ్చి ఇక్కడ స్క్రాప్ దుకాణం నదిపిస్తున్నట్లు దీనిలో కుటుంబ పోషణ కష్టం కావడంతో కొడుకు సిద్దిక్ షా తో కలిసి ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో తేదీందని వారు తెలిపారు.
ALSO READ :
Viral : విచిత్ర దొంగ.. దొంగతనానికి వస్తే ఇంట్లో ఏమీ లేవని సీసీటీవీ వద్ద ఆవేదన..!
Srisailam reservoir Latest Update : తెరుచుకోనున్న శ్రీశైలం గేట్లు.. కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం..!









