మిర్యాలగూడ : పోలీస్ స్టేషన్ లోనే కొట్టుకున్నారు వాళ్లు ..!

మిర్యాలగూడ : పోలీస్ స్టేషన్ లోనే కొట్టుకున్నారు వాళ్లు ..!

మిర్యాలగూడ, మన సాక్షి

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో థర్డ్ జెండర్స్ పోలీసుల ముందే కొట్టుకున్నారు. మంగళవారం వివాదం విషయమై రెండు వర్గాల వారు పోలీస్ స్టేషన్ కు సుమారు 50 మంది థర్డ్ జెండర్స్ చేరుకున్నారు. కాగా అక్కడే పోలీస్ స్టేషన్ ఆవరణలోనే రెండు వర్గాల వారు కొట్టుకున్నారు.

 

దాంతో పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేసినా.. కొంతసేపటికి ఒక వర్గం వారిని స్టేషన్ లో ఉంచి మరో వర్గం వారిని బయటకు వెళ్ళగొట్టడం జరిగింది. ఈ సంఘటన సుమారు అరగంట పాటు పోలీస్ స్టేషన్లో, పోలీస్ స్టేషన్ ఎదుట జరగడంతో అక్కడి నుంచి వెళ్లే వారంతా ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

ALSO READ : 

1. GPay : గూగుల్ పే వినియోగించే వారికి భారీ గుడ్ న్యూస్.. మళ్లీ క్యాష్ బ్యాక్.. ఎలానో తెలుసుకుందాం..!

2. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే సర్వీసులు..!

3. Telangana : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. 2858 పోస్టులు..!