సమాచారం మాకు.. బహుమతి మీకు, కరపత్రాలతో పోలీసుల ప్రచారం దేనికో తెలిస్తే షాక్
ఏజెన్సీలో మావోయిస్టుల యాక్షన్.టీం సంచారం
సమాచారం మాకు.. బహుమతి మీకు, కరపత్రాలతో పోలీసుల ప్రచారం దేనికో తెలిస్తే షాక్
వెంకటాపురం , మనసాక్షి:
ఏజెన్సీ లో మావోస్టుల సంచారం వల్ల పట్టుకునేందుకు పోలీసులు సరికొత్తగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో శనివారం సురవీడు, ఆలుబాకవద్ద సిఆర్పిఎఫ్ బలగాలతో కలిసి సిఐ కె.శివప్రసాద్ వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది. వెంకటాపురం, వాజేడు మండలాల్లో మావోయిస్టులు తిరుగుతున్నట్టు నమ్మదగిన సమాచారం మేరకు యాక్షన్ టీంకి సంబంధించిన పోస్టర్లతో వాహనాలు తనిఖీచేస్తూ ఏజెన్సీ ప్రాంతంలోని టార్గెట్ పర్సన్స్ ని అలర్ట్ చేశారు.

డ్రోన్ కెమెరాలతోతెలంగాణ, చత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.పోస్టర్లోని వ్యక్తులు కనిపించినట్లయితే. లేదా ఎవరైనా అనుమానితులు మీఏరియాలో తిరుగుతున్నట్లయితే వెంటనే పోలీసులకు తెలపాలని. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని 5 లక్షలనుండి 20 లక్షల వరకు నగదు బహుమతి ఇవ్వబడుతుందని. అనుమానితులు ఎవరైనా కనబడితే ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
CI వెంకటాపురం 8712670114
SI వెంకటాపురం 8712670098
SI వాజేడు 8712670096
SI పేరూరు 8712670094









