తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : సహకార సంఘాల్లో రబీ ధాన్యం కొనుగోలు.. మద్దతు ధర తగ్గొద్దు.. అదనపు జిల్లా కలెక్టర్ ఆదేశం..!

Nalgonda : సహకార సంఘాల్లో రబీ ధాన్యం కొనుగోలు.. మద్దతు ధర తగ్గొద్దు.. అదనపు జిల్లా కలెక్టర్ ఆదేశం..!

నల్లగొండ, మన సాక్షి .

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలు, చైర్మెన్లకు రబీ ధాన్యం సేకరణ, మద్దతు ధర పై ఏర్పాటు చేసిన సమావేశంలో అదన్నపు జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రణాళిక బద్దంగా రబీ ధాన్యం సేకరణ చేయాలని, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.

అన్ని కేంద్రాలలో ధాన్యం తూర్పార బట్టే యంత్రాలు, తూకం వేసేయంత్రాలు, తేమ కొలిచే యంత్రాలు, టార్పాలిన్లు, తాగునీరు, టెంట్, ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తున్న విషయాన్ని తెలియజేయాలని చెప్పారు.

సన్న ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయాలని, దొడ్డు ధాన్యానికి వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లో ధాన్యం అమ్మిన మొత్తం వారి బ్యాంకు ఖాతాలలో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇందుకు గాను ఓబిఎమ్ఎస్, ట్రక్ షీట్లను వెంటనే జనరేట్ చేసే విధంగా చూడాలని అన్నారు.

డి సి సి బి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, డి సి ఎం ఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్,జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయా దేవి, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

MOST READ : 

  1. District collector : ట్రైనీ కలెక్టర్ గరీమ నరుల కు ఘన సత్కారం చేసిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు..!

  2. UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ లావాదేవీలకు కేంద్రం గుడ్ న్యూస్..!

  3. Rythu Bharosa : రైతు భరోసా పై భారీ గుడ్ న్యూస్.. నిధుల కేటాయింపు..!

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ లావాదేవీలకు కేంద్రం గుడ్ న్యూస్..!

  5. WhatsApp : మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్.. ఎలా చేస్తారంటే.. బిగ్ అలర్ట్..!

మరిన్ని వార్తలు