Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. వైద్య విద్యార్థులు, డాక్టర్ సస్పెండ్..!

Nalgonda : మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. వైద్య విద్యార్థులు, డాక్టర్ సస్పెండ్..!

నల్లగొండ, మనసాక్షి :

నల్లగొండ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినిలను ర్యాగింగ్ చేశారని ముగ్గురు వైద్య విద్యార్థులను, ఒక జూనియర్ డాక్టర్ను సస్పెండ్ చేసినట్టు తెలిసింది. అందులో రెండవ సంవత్సరం విద్యార్థిని ఒక నెల, ఇద్దరు నాలుగో సంవత్సరం విద్యార్థులను ఆరు నెలలు, ఒక జూనియర్ డాక్టర్ను మూడు నెలలు సస్పెండ్ చేసినట్లు కాలేజీ వర్గాలు పేర్కొన్నాయి.

చాలాకాలంగా మెడికల్ కాలేజీలో విద్యార్థినిల పట్ల ర్యాగింగ్ జరుగుతున్నప్పటికీ కాలేజీ అధ్యాపక బృందం గుర్తించడంలో విఫలమైనట్లు సమాచారం. కొన్ని సంవత్సరాల తర్వాత నల్లగొండ జిల్లాలో ర్యాగింగ్ పేరు మొదటిసారిగా వినబడింది. ఇప్పటికైనా కాలేజీలలో ఇలాంటి వేధింపులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు,విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

MOST READ : 

మరిన్ని వార్తలు