Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయంవ్యవసాయం

రైతులంతా ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉంది – కేసీఆర్

600 మంది రైతులకు ఆర్థిక సహాయం

న్యూఢిల్లీ , మనసాక్షి : చండీగ‌ఢ్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో ఆదివారం రైతు ఉద్య‌మంలో మ‌ర‌ణించిన రైతు కుటుంబాల‌కు, గాల్వాన్ స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ‌ల్లో అమ‌రులైన సైనిక కుటుంబాల‌కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆర్థిక స‌హాయం అందించారు. రైతు ఉద్యమం లో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల చొప్పున ఆరు వందల మంది రైతులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. రైతులతో ఫ్రెండ్లీ గా ఉండే ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి అస్సలు గిట్టదన్నారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతులందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు. రైతులు ఒంటరి అయ్యామని ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. రైతు కుటుంబాలు ఆందోళన చెందవద్దని తెలంగాణ సర్కార్ అండగా ఉంటుందన్నారు. రైతులు చేసే ఉద్యమానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

1. పంట రుణాలు చెల్లించొద్దు, అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాం – రేవంత్ రెడ్డి

2. నల్గొండ పై కోమటిరెడ్డి దృష్టి, రేపు నల్గొండలో ఆత్మీయ సమ్మేళనం

3. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన : 12 నెలల్లో అధికారంలోకి కాంగ్రెస్ – latest news

మరిన్ని వార్తలు