Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతరలుజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Ramalingeshwar Swami Kalyanam : ఘనంగా శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి శాంతి కళ్యాణ మహోత్సవం..!

Ramalingeshwar Swami Kalyanam : ఘనంగా శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి శాంతి కళ్యాణ మహోత్సవం..!

చింతపల్లి, మన సాక్షి:

కోరిన కోరికలు తీర్చే దైవంగా భావిస్తూ తీ దేడు ( వెంకటం పేట ) గ్రామ సమీపంలో నెలకొని ఉన్న శ్రీశ్రీ భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవం పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత ఉత్సవాలు, శ్రీ రామలింగేశ్వర స్వామి శాంతి కళ్యాణ మహోత్సవం గురువారం గుట్టపై వేలాదిమంది భక్తులు నడుమ వేద మంత్రోచ్ఛరణలతో ఎంతో భక్తి భావంతో భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు.

 

గత రెండు వందల సంవత్సరాల క్రితం గ్రామ సమీపంలో నెలకొని ఉన్న ఈ దేవాలయం అంచె లంచలుగా అభివృద్ధి చెందుతూ ఆనాటి నుండి నేటి వరకు గ్రామ పెద్దల సహకారంతో దైవ సంకల్పంతో ముందుకు వెళుతూ స్వామివారి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు గత మూడు రోజుల నుండి అత్యంత వైభ వంగ వివిధ కార్యక్రమాలతో నిర్వహించబడుతున్నాయి.ఈ కార్యక్రమాలకు జిల్లా నలుమూలల నుండి వేలాది మంది భక్తులు హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

 

ఈ సందర్భంగా స్వామివారి కల్యాణంలో పాల్గొన్న జంటలు తేదీలు మాజీ సర్పంచ్ కాయితి జితేందర్ రెడ్డి కవిత, కొరివి యాదగిరి భాగ్యశ్రీ, కాయితి బచ్చిరెడ్డి సరిత, కలగోని యాదగిరి శ్రీలక్ష్మి, స్వామివారి కల్యాణ కార్యక్రమంలో పాల్గొని కళ్యాణం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ధరణి పతి రమణారావు మాజీ సర్పంచ్ దాసరి శ్రీనివాస్ యాదవ్, మోర కిరణ్ బాబు, గున మోని శ్రీనివాస్, మరు ప్రభాకర్ రావు,సొనగంటి కృష్ణమాచారి, కొరివి రాధాకృష్ణ, సొనగంటి గోవర్ధనాచారి, కాయితి వెంకటరెడ్డి, గొడుగు సత్తయ్య, కాయితి కృష్ణారెడ్డి, అయితమోని మల్లయ్య, కొరివి శంకరయ్య, పల్లగట్టు వేణుగోపాల్, కాయతి కిరణ్ రెడ్డి, కాయితి సందీప్ రెడ్డి, జి.అంజయ్య, టి. పాపయ్య, శంకర్, సైదులు, బొడ్డు యాదగిరి, సిహెచ్ రాకేష్ గ్రామ పెద్దలు భక్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ALS READ : IPL : ఐపీఎల్ చరిత్రలో ఎస్ ఆర్ హెచ్ సునామి.. సరికొత్త రికార్డు సృష్టించిన ఎస్ ఆర్ హెచ్..!

మరిన్ని వార్తలు