Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణమంచిర్యాల జిల్లా

Driving : ప్రాణాలు తీస్తున్న ర్యాష్ డ్రైవింగ్..!

Driving : ప్రాణాలు తీస్తున్న ర్యాష్ డ్రైవింగ్..!

లక్షేట్టిపేట్ , (మన సాక్షి);

లక్షేట్టిపేట్ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న యువత ర్యాష్ డ్రైవింగ్. పట్టణంలో ఉన్న యువకులు సాయంత్రం కాగానే బయటకు వచ్చి బస్టాండ్ ఏరియా నుండి సమీపంలో ఉన్న ఉత్కూరు చౌరస్తా, కరీంనగర్ చౌరస్తా, ఇటిక్యాల స్టేజ్ వద్దకు యువకులు నేను ముందా నువ్వు ముందా అనుకుంటూ పోటీలు పెట్టుకుంటూ రైడింగ్ చేయడం వల్ల అమాయక ప్రజలను భయంఆందోళనలకు గురవుతున్నారు.

కొన్ని నెలల కిందట కూడా బైక్ రేస్ డ్రైవింగ్ వల్ల గాంధీ బొమ్మలో రోడ్డు దాటుతున్న మహిళలకు ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. అతివేగంగా వాహనాన్ని నడపడం వల్ల పట్టణంలో ఉత్కూర్ చౌరస్తాలో సమీపంలో జరిగిన యాక్సిడెంట్ వల్ల పట్టణానికి చెందిన వ్యాపారి, యువకుడు ఇద్దరి ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది.

ఇలా ప్రతి నెల ఏదో ఒకటి యాక్సిడెంట్ జరుగుతూనే ఉంది అనవసర అతివేగం వల్ల. యువత హైదరాబాద్ తదితర నగరాల నుండి వాహనాలను కొంత సొమ్ము చెల్లించి అవి ఇక్కడికి తీసుకుని వచ్చి మద్యం మత్తులో కొందరు, మరికొందరు యువకులు సరదాగా పోటీలు పెట్టుకోవడం, చిన్నగా ఉండే రోడ్డుమీద అతివేగంగా వెళ్లడం వల్ల పక్కన ఉన్న పట్టణ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

వారు నడిపే వాహనాలకు సరైన పత్రాలు కూడా ఉండకపోవచ్చు అని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి రైడింగ్ మితిమీరకముందే సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఎంబడి తిరుపతి, మేము సైతం యూత్ అధ్యక్షుడు

యువకులు పట్టణంలో అతివేగంతో వెళ్లడం, వారు నడిపే బైక్ లో నుండి భారీ శబ్దం రావడం వల్ల ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు.

కోనేటి రాజ్ కుమార్, మాజీ వార్డ్ మెంబర్

పట్టణంలో సాయంత్రం వేళ పిల్లలను బయటకు తీసుకొని వెళ్ళాలి అంటే యువకులు అతివేగంగా నడిపే డ్రైవింగ్ వల్ల వెళ్లలేకపోతున్నాము.

ALSO READ : 

డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా..? అయితే ఈ జాబ్ ఛాన్స్.. మిస్ కాకండి..!

IPL : ముంబై కి బై బై.. ఆ ఛాంపియన్ ఇక ఏ జట్టుకు వెళ్తాడో..?

ఏళ్ల తరబడి తండ్రి మృతదేహం ఇంట్లోనే.. ఎందుకు దాచిందో తెలిస్తే షాక్..!

SRH : ఎస్ ఆర్ హెచ్ కు బిగ్ షాక్.. ఇండియా వదిలి వెళ్లిపోయిన కామిన్స్, హెడ్..!

మరిన్ని వార్తలు