BREAKING: ఆర్ అండ్ బీ అసిస్టెంట్ ఇంజనీర్ సస్పెండ్..!

రామగుండం రోడ్లు భవనాల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ యం.డి జావిద్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

BREAKING: ఆర్ అండ్ బీ అసిస్టెంట్ ఇంజనీర్ సస్పెండ్..!

జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు

పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి ప్రతినిధి :

రామగుండం రోడ్లు భవనాల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ యం.డి జావిద్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టే అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని పలు మార్లు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ రామగుండం మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడాన్ని జిల్లా కలెక్టర్ నేడు తన పర్యటనలో గమనించారు.

ప్రభుత్వం నుంచి పనులు పూర్తి చేసేందుకు మార్గదర్శకాలు వచ్చినప్పటికీ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రామగుండం రోడ్లు భవనాల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ యం.డి జావిద్ ను సస్పెండ్ చేస్తున్నట్లు, సంబంధిత ఇంజనీర్ పై విచారణ పూర్తయ్యే వరకు హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళడానికి వీలులేదని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ALSO READ :

Success Story : క్యాటరింగ్ వర్కర్ నుంచి.. అసిస్టెంట్ ఇంజనీర్ గా కొలువు, సక్సెస్ కు సింబల్ గా మారిన యువకుడు..!

Miryalaguda : మిర్యాలగూడలో నాలుగు చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణం.. జంక్షన్ లను పరిశీలించిన ఎమ్మెల్యే..!