రోడ్డు ప్రమాదానికి గురై పిఆర్ టీ యు సంఘం నాయకులు మృతి..!

చింతపల్లి మండల పరిధిలోని కొర్రమాన్సింగ్ తండాలో ప్రధానోపాధ్యాయులు గా పనిచేస్తున్న కొండోజు శివ రంగాచారి శనివారం రాత్రి హైదరాబాదులోని సాగర్ ఎక్స్ రోడ్ సమీపంలో అమ్మవారి దేవాలయ సమీపంలో తన మోటార్ బైక్ పై వెళ్తున్న క్రమంలో వెనక నుండి ఆటో ఢీ కొట్టింది దీంతో మోటర్ బైక్ పై ప్రయాణిస్తున్న ఉపాధ్యాయులు శివ రంగాచారి తలకు బలమైన గాయాలు తగిలాయి.

రోడ్డు ప్రమాదానికి గురై పిఆర్ టీ యు సంఘం నాయకులు మృతి..!

చింతపల్లి, మనసాక్షి:

చింతపల్లి మండల పరిధిలోని కొర్రమాన్సింగ్ తండాలో ప్రధానోపాధ్యాయులు గా పనిచేస్తున్న కొండోజు శివ రంగాచారి శనివారం రాత్రి హైదరాబాదులోని సాగర్ ఎక్స్ రోడ్ సమీపంలో అమ్మవారి దేవాలయ సమీపంలో తన మోటార్ బైక్ పై వెళ్తున్న క్రమంలో వెనక నుండి ఆటో ఢీ కొట్టింది దీంతో మోటర్ బైక్ పై ప్రయాణిస్తున్న ఉపాధ్యాయులు శివ రంగాచారి తలకు బలమైన గాయాలు తగిలాయి.

అదే సమయంలో సమీపంలో ఉన్న స్థానిక పోలీసులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఉపాధ్యాయుడు సాగర్ కాంప్లెక్స్ సమీపంలో ప్రస్తుతం నివాసం ఉంటున్నాడు. ఇంటికి వేరే క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికప్రయాణికులు, పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.

తీవ్రంగా గాయాలైన ఉపాధ్యాయుని పక్కనే ఉన్న ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందు శనివారం రాత్రి రెండు గంటల సమయంలో మృత్యుకు గురయ్యారు. ఈ విషయమై వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొనిదర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ : BREAKING : సూర్యాపేట గురుకుల పాఠశాల మరో విద్యార్థిని ఆత్మహత్య..!

ఏ సంఘటన విషయం తెలిసిన పి టిఆర్టియు యు టి ఎస్ యు టి ఎఫ్ ఉపాధ్యాయ సంఘ నాయకులు . బంధుమిత్రులు వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. వారు ఆ కాల మృతి సంఘానికి తీరనిలోటని ఉపాధ్యాయులు కన్నీటి పర్యాంతమయ్యారు.

మృతుడు ఉపాధ్యాయుడు శివ రంగచారి కి భార్య, ఇరువురు పిల్లలు కలిగి ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం భార్య భాగ్యలక్ష్మి మర్రిగూడ మండలం కస్తూర్బా పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నట్లు సమాచారం.

ALSO READ : Google : గూగుల్ యూజర్లకు వార్నింగ్.. ప్లీజ్ ఇలా చేయొద్దు..!