తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం..!

తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం..!

కార్యక్రమంలో పాల్గొన్న శంకర్‌పల్లి బీజేపీ నాయకులు

శంకర్‌పల్లి: (మన సాక్షి):

తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం 2024 ఉత్సవాలు నగరంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలు తెలుగు సంగమం అధ్యక్షుడు, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జి, బిజెపి సీనియర్ నాయకులు మురళీధర్ రావు ఆధ్వర్యంలో జరిగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామానుజ చిన్న జీయర్ స్వామి, హర్యానా, మిజోరాం రాష్ట్ర గవర్నర్లు బండారు దత్తాత్రేయ, హరిబాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు,

నాయకులు జనార్దన్ రెడ్డి, బండారు విజయలక్ష్మి, రాణి రుద్రమ రెడ్డి, సినీ నటి మాధవి లత, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి తొండ రవి, శంకర్‌పల్లి నాయకులు సురేష్ యాదవ్, రవిచంద్ర, నితిన్ పాల్గొన్నారు.

ALSO READ : నల్గొండ : బిజెపి జిల్లా అధ్యక్షునిగా డాక్టర్ వర్షిత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ..!