సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకలు ముగ్గుల పోటీలు- మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకలు ముగ్గుల పోటీలు

విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

సూర్యాపేట , మనసాక్షి: తెలుగు సంస్కృతికి, సాంప్రదాయాలకు ముగ్గుల పోటీలు ప్రతీకలు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణం లోని విద్యానగర్ లోని రామలింగేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో 46 వ వార్డ్ లో బీఆర్ఎస్ నాయకులు ఆంగోతు బావ్ సింగ్ , సంధ్య దంపతుల ఆధ్వర్యం లో జరిగిన ముగ్గుల పోటీల కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. సంక్రాంతి పండుగ ప్రకృతి పండుగ అని తెలిపారు. సాంస్కృతిక అంశాలు మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి, ఏకాగ్రతకు ఎంతగానో దోహదపడుతాయని తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు సంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి..

కార్యక్రమం లో గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపాగని వెంకట్ నారాయణ గౌడ్, సత్య న్యూస్ చానల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..