Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Save Congress Save Miryalaguda : మిర్యాలగూడ టికెట్ కాంగ్రెస్ కే ఇవ్వాలి.. సేవ్ కాంగ్రెస్, సేవ్ మిర్యాలగూడ.. నినాదంతో ర్యాలీ..!

Save Congress Save Miryalaguda : మిర్యాలగూడ టికెట్ కాంగ్రెస్ కే ఇవ్వాలి.. సేవ్ కాంగ్రెస్, సేవ్ మిర్యాలగూడ.. నినాదంతో ర్యాలీ..!

మిర్యాలగూడ , మన సాక్షి :

కాంగ్రెస్ పార్టీకి తో వామపక్ష పార్టీలకు అవగాహన ఉన్న నేపథ్యంలో మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ ను కాంగ్రెస్ పార్టీకే కేటాయించాలని ఆ పార్టీ మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సామాజికవేత్త బత్తుల లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మిర్యాలగూడలోని బిఎల్ఆర్ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మిర్యాలగూడలో బీఆర్ఎస్ తో పోటీ పడటానికి కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చినా.. అధిష్టాన నిర్ణయం మేరకు తాము నడుచుకుంటామని తెలిపారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీకి టికెట్ కేటాయించవద్దన్నారు.

ALSO READ : నల్గొండ : మాడుగులపల్లి నుంచి సినీ ఫక్కిలో పరార్.. వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద కోట్ల కొద్ది కట్టల పట్టివేత..!

గత పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిర్యాలగూడ నియోజకవర్గంలో నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాను పార్టీలోకి చేరిన కానించి కార్యకర్తలకు అండగా ఉంటున్నానని తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిచే సత్తా ఉందన్నారు.

మిర్యాలగూడ టిక్కెట్ ను కాంగ్రెస్ పార్టీకే ఇవ్వాలని.. ఈనెల 17వ తేదీ న “సేవ్ కాంగ్రెస్ సేవ్ మిర్యాలగూడ” నినాదంతో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. దామరచర్ల మండలంలోని దివంగత మాజీ ఎమ్మెల్యే ధీరావత్ రాగ్యనాయక్ స్తూపం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు.

రాగ్య నాయక్ స్తూపం నుంచి మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వరకు “సేవ్ కాంగ్రెస్ సేవ్ మిర్యాలగూడ” నినాదంతో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇవ్వకుంటే అప్పుడు తన ఆలోచన మరోసారి తెలియజేస్తానన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకే టికెట్ ఇవ్వాలని.. ఎవరికి టికెట్ ఇచ్చినా అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటామని తెలిపారు.

ALSO READ : Online History : మీ ఆన్ లైన్ చరిత్ర అంతా అక్కడుంది.. మీరు ఓపెన్ చేసే సైట్లు, పాస్ వర్డ్స్ అన్ని అక్కడ స్టోర్ అవుతాయి.. తెలుసుకోండి ఇలా..!

సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్, డిసిసి ఉపాధ్యక్షులు చిలుకూరి బాలు, పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు కొమ్ము శ్రీనివాస్, పందిరి అనిత, నాగలక్ష్మి, సర్పంచ్ లు తక్కెళ్ళపల్లి శ్రీనివాస్, అంజిరెడ్డి తోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు