లాక్ షోర్ పాఠశాలను వెంటనే సీజ్ చేయాలి

లాక్ షోర్ పాఠశాలను వెంటనే సీజ్ చేయాలి

మంచిర్యాల ప్రతినిధి, అక్టోబర్ 15 మన సాక్షి: మంచిర్యాల పట్టణంలోని పాత మంచిర్యాలలో సరైన విద్యా ప్రమాణాలు పాటించని లాక్ షోర్ పాఠశాలను సంబంధిత అధికారులు వెంటనే తనిఖీ చేసి, పాఠశాలను సీజ్ చేయాలని ఐక్య విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మంచిర్యాల ఎంఈఓ కార్యాలయంలోని అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ALSO READ : మేళ్లచెరువు : తృటిలో తప్పిన విద్యుత్ ప్రమాదం

అనంతరం వారు మాట్లాడుతూ, లాక్ షోర్ పాఠశాలలో కనీస సౌకర్యాలు, ఫైర్ సేఫ్టీ, మైదానం తదిత సౌకర్య లేకుండానే రేకుల షెడ్డులో తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు టై, బెల్ట్, బుక్స్, బయట కొనే అవకాశం ఉన్న పాఠశాలలోనే కొనాలని యాజమాన్యం కచ్చితంగా నిబంధనలు పెట్టి, విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. విద్యార్థులు మానసిక ఉల్లాసం కోసం ఆడుకోవడానికి సరైన మైదానం కూడా లేదని, పాఠశాలలో ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం జరిగితే దానిని అరికట్టేందుకు సరైన ఫైర్ సేఫ్టీ లేదని ఆరోపించారు.

ALSO READ : వేములపల్లి : భారీ వర్షాలకు జలమయమైన లోతట్టు ప్రాంతాలు

కనీస అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యాబోధన బోధిస్తున్నారని, దీంతో తీవ్రంగా విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. కనీస సౌకర్యాలు లేకుండా నడిపిస్తున్న సదరు పాఠశాల గుర్తింపు రద్దుచేసి, వెంటనే పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్ కుమార్, టిపివిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరలా వంశీ, టివియువి నాయకులు రాకేష్, పురేళ్ల నితీష్ తదితరులు పాల్గొన్నారు.