సూర్యాపేట : సెల్ఫీ విత్ ట్యాంక్ బండ్.. వినూతన నిరసన..!
30 వ వార్డు కౌన్సిలర్ మహాలక్ష్మి-మల్సూర్ గౌడ్

సూర్యాపేట : సెల్ఫీ విత్ ట్యాంక్ బండ్.. వినూతన నిరసన..!
30 వ వార్డు కౌన్సిలర్ మహాలక్ష్మి-మల్సూర్ గౌడ్
సూర్యపేట , మనసాక్షి :
ట్యాంక్ బండ్ వెనుక వైపు ఉన్న 30 వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో పాటు, కంప చెట్లు, మురికి వాసన, పందులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వార్డ్ కౌన్సిలర్ పలస మహాలక్ష్మి – మల్సూర్ గౌడ్ ల ఆధ్వర్యంలో బిజెపి నాయకులతో కలిసి ట్యాంక్ బండ్ వెనుక భాగాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ట్యాంక్ బండ్ అభివృద్ధి చేసినట్లు చెప్పుకుంటున్న మంత్రి జగదీశ్ రెడ్డి కి… ట్యాంకుబండు కు మరోవైపు ఆనుకొని ఉన్న 30,43,42 వ వార్డు ప్రజల ఇబ్బందులు కనబడడం లేదా అని ప్రశ్నించారు. నిత్యం కంప చెట్లు, పందులు, డ్రైనేజీ అధ్వానంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ట్యాంకుబండు మీదికి వెళ్లి సెల్ఫీలు దిగే మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి వెనుక వైపు వచ్చి సెల్ఫీలు దిగితే ప్రజలు పడే బాధ ఏంటో తెలిసి ఉండేదని అన్నారు. పురుగులతో ప్రజలు రాత్రిపూట నిద్రపోలేని పరిస్థితి ట్యాంకుబండుకు మరోవైపు ఉందని ట్యాంకుబండును ఒకవైపు మాత్రమే అభివృద్ధి చేస్తే. మరోవైపు ఎవరు వచ్చి అభివృద్ధి చేస్తారని అన్నారు.
ఓట్ల కోసం ట్యాంక్ బండ్ నూ చూపెట్టే మంత్రి కి ట్యాంక్ బండ్ పక్కన ఉన్న ప్రజల బాధలు కనపడటము లెవా అన్నారు. అభివృద్ధి చేశామని ఫ్లెక్సీల కోసం, వాట్సప్ కోసం, వాల్ పోస్టర్ల కోసం కాకుండా ప్రజల సమస్యల పరిష్కారం కోసం మంత్రి జగదీశ్ రెడ్డి అభివృద్ధి చేస్తే బాగుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నరసింహ, జిల్లా కోశాధికారి పగిళ్ల సుసింధర్ రెడ్డి, జిల్లా నాయకులు పోలగాని ధనుంజయ్ గౌడ్, సంధ్యాల సైదులు, పాటి కరుణాకర్ రెడ్డి, బిట్టు నాగరాజు, సోషల్ మీడియా పార్లమెంట్ కన్వీనర్ కొప్పుల క్రాంతి రెడ్డి, వార్డు ప్రజలు శివరాత్రి, అంజన్ ,లక్ష్మణ్ గుండెపురి సతీష్ ,నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
- Restarent : ఆ రెస్టారెంట్ లో తినాలంటే నాలుగేళ్ల ముందే బుక్ చేసుకోవాలంట.. స్పెషల్ ఏంటో..?
- Chicken : చికెన్ కిలో రూ.100 మాత్రమే.. గంటలోనే అన్ని షాపుల్లో ఖాళీ..!
- Womens : నిరుపేద మహిళలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు..!
- TSRTC : ప్రయాణికులకు ఆర్టీసీ మరో శుభవార్త .. రూ. 50కే రోజంతా ప్రయాణం..!