విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి – ఎస్ఎఫ్ఐ

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి – ఎస్ఎఫ్ఐ

తుంగపాడు మోడల్ స్కూల్ ముందు ధర్నా

మిర్యాలగూడ, మనసాక్షి: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తుంగపాడు మోడల్ స్కూల్ లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేదని సాగర్ హైవే మీద ధర్నా నిర్వహించడం జరిగింది.

ALSO READ : వ్యవసాయ బావిలో పడిన కారు, ఒకరు మృతి – latest news

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ముడవత్ జగన్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం మెనూ పెంచకుండా విద్యార్థులకు అరకొర వసతులతో భోజనాన్ని అందించడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారని అన్నారు.

తుంగపాడు మోడల్ స్కూల్లో విద్యార్థులకు ఉడికి ఉడకని అన్నంతో భోజనాన్ని అందిస్తున్నారని అన్నారు. విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ లోపం వల్ల ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలంటే మధ్యాహ్న భోజనం మెనూ పెంచాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే, మంత్రుల జీతాలు పెంచుకోవడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి.

ALSO READ : హుజూర్ నగర్ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

కానీ పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో మెనూ పెంచడంలో ఈ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైతుందన్నారు. తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకొని మధ్యాహ్న భోజనంలో మెనూ పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో దామరచర్ల మండల కార్యదర్శి వీరన్న డివిజన్ కమిటీ సభ్యులు తరుణ్, నుమాన్, ఉపేందర్, చందు, భరత్, స్వామి, లక్కీ విద్యార్థులు పాల్గొన్నారు.