షాద్ నగర్ : డిప్యూటీ డీఎం హెచ్ఓగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ విజయలక్ష్మి..!

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ డివిజన్ లో డిప్యూటీ డిఎం మరియు హెచ్ఓ గా డిప్యూటేషన్ లో పనిచేస్తున్న డాక్టర్ ఎస్ జయలక్ష్మి గత వారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలోని అన్ని డిపిటేషన్లను రద్దు చేయడం వల్ల డాక్టర్ ఎస్ జయలక్ష్మి తమ ఒరిజినల్ ప్లేస్ అయిన భద్రాదికొత్తగూడెంకు వెళ్లిపోయారు.

షాద్ నగర్ : డిప్యూటీ డీఎం హెచ్ఓగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ విజయలక్ష్మి..!

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్,  మనసాక్షి :

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ డివిజన్ లో డిప్యూటీ డిఎం మరియు హెచ్ఓ గా డిప్యూటేషన్ లో పనిచేస్తున్న డాక్టర్ ఎస్ జయలక్ష్మి గత వారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలోని అన్ని డిపిటేషన్లను రద్దు చేయడం వల్ల డాక్టర్ ఎస్ జయలక్ష్మి తమ ఒరిజినల్ ప్లేస్ అయిన భద్రాదికొత్తగూడెంకు వెళ్లిపోయారు.

ప్రస్తుతము షాద్ నగర్ డివిజన్ డిప్యూటీ పోస్ట్ కాళీ అయినందువలన. రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి. వెంకటేశ్వరరావు షాద్ నగర్ పిపి యూనిట్ లో పనిచేస్తున్న డాక్టర్ వి. విజయలక్ష్మి కీ షాద్ నగర్ డివిజన్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ గా అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది.

ఈరోజు డాక్టర్ విజయలక్ష్మి షాద్ నగర్ డివిజన్ డిప్యూటీ డిఎమ్ మరియు హెచ్ ఓ గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంలో షాద్ నగర్ డివిజన్లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల హెల్త్ సూపర్వైజర్లు డాక్టర్ వి. విజయలక్ష్మి కీ శుభాకాంక్షలు తెలిపారు.

ALSO READ : ఆంధ్రప్రదేశ్ లో దారుణం.. భార్య నోట్లో గుడ్డలు కుక్కి భర్తను..!

హెల్త్ సూపర్వైజర్లు అందరూ, అన్ని ప్రోగ్రాంలో షాద్ నగర్ డివిజన్ కు నిర్దేశించిన లక్ష్యాలను ముందంజలో తీసుకపోవడానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంలో డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. హెల్త్ సూపర్వైజర్లు అనగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బాధ్యతాయుతమైన సూపర్వైజర్ అని తెలిపారు.

హెల్త్ సూపర్వైజర్లు అందరూ కూడా వైద్య అధికారులకు, ఏఎన్ఎం లకు మరియు ఆశాలకు అనుసంధానముగా పనిచేస్తూ, అన్ని ప్రోగ్రాంలో సాధించవలసిన లక్ష్యాలను, ముందంజలో తీసుకుపోవడానికి కృషి చేయాలని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల హెల్త్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.

ALSO READ : Telangana : ఉచిత విద్యుత్ కోసం ఆధార్ కు ప్రత్యామ్నాయం ఉంది.. రేషన్ కార్డుకు లేకుంటే ఎలా..!