Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

Vijayawada : లాంతరు పట్టిన షర్మిల.. తప్పు జగన్ చేస్తే ప్రజలపై భారం ఎందుకు..!

Vijayawada : లాంతరు పట్టిన షర్మిల.. తప్పు జగన్ చేస్తే ప్రజలపై భారం ఎందుకు..!

మన సాక్షి

సర్దుబాటు చార్జీల పేరుతో పెరిగిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి లాంతర్ పట్టుకొని ర్యాలీ నిర్వహించారు.

పార్టీ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ సర్కిల్ వరకు లాంతర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ

– పెరిగిన చార్జీలతో ప్రజలు ఇక అంధకారంలో బ్రతకాలి
– లాంతర్లు కొనుక్కోవాలి
– వైసిపి హయంలో 35 వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారు
– ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే విధానాన్ని అమలు చేస్తుంది
– ఇప్పటికే 17 వేల కోట్లు భారాన్ని మోపారు
– వైసిపి కి కూటమి కి తేడా ఏమీ లేదు
– ఇదెక్కడి న్యాయం
– ఇది వైసిపి చేసిన పాపం అంటున్నారు
– 4 రూపాయలు పడే యూనిట్ ధర 8 రూపాయలు పెట్టరాట
– అక్రమంగా హిందూజా లాంటి కంపెనీలకు చెల్లించారట
– తప్పు జగన్ చేస్తే ప్రజలపై భారం ఎందుకు ?
– ప్రజలు ఆ భారాన్ని ఎందుకు చెల్లించాలి ?
– ఇప్పటికే ఏపిలో విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయి
– తెలంగాణలో 4.80 పైసలు యూనిట్ ధర ఉంటే…
– ఆంధ్రలో యూనిట్ కి 6 రూపాయలు వసూలు చేస్తున్నారు
– ఇప్పుడు సర్దుబాటు చార్జీలు పేరుతో 40 శాతం అధికంగా వసూలు చేస్తున్నారు
– ప్రజలు మీకు ఓట్లు వేసింది వైసిపి మీద వ్యతిరేకత తోనే
– ఇపుడు మీరు భారాన్ని మోపడం అన్యాయం
– వైసిపి తప్పు చేస్తే చర్యలు తీసుకోండి
– విచారణ జరపండి

MOST READ : 

మరిన్ని వార్తలు