Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ
రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ శ్వేత దుర్మరణం..!
రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ శ్వేత దుర్మరణం..!
జగిత్యాల, (మన సాక్షి)
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో, డీసీఆర్‌బీ ఎస్‌ఐ శ్వేత మరియు ద్విచక్రవాహనంపై ఉన్న వాహనదారుడు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం లో, హెచ్ఎఫ్ డీలక్స్ టీ ఏస్ 21 జి 4172 నెంబర్ ప్లేట్‌తో ఉన్న ద్విచక్రవాహనం ఉన్న వాహనదారుడు కూడా మరణించారు.
ధర్మారం మండలం అరుణకొండ నుండి జగిత్యాలకు వస్తున్న ఎస్‌ఐ శ్వేత, ముందుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని అతి వేగంతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ మరణించారు. ప్రమాదం జరిగిన తర్వాత, కారు రోడ్డుకు కిందికి దూసుకెళ్లింది.
తన విధులకు అత్యంత నిబద్ధతతో పనిచేసిన ఎస్‌ఐ శ్వేత, గతంలో కోరుట్ల, వెల్గటూరు, కథలాపూర్, పెగడపల్లి ప్రాంతాలలో ఎస్‌ఐగా పనిచేశారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో భరోసా డబ్బులు.. ఎప్పటినుంటే.. లేటెస్ట్ అప్డేట్
-
Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!
-
District collector : ప్రజావాణి పెండింగ్ అర్జీలను వెంటనే పరిష్కరించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
Gold Price : పసిడి ప్రియులకు భారీ ఊరట.. తగ్గిన బంగారం ధర..!









