Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లావిద్య

Spot Counseling : తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో స్పాట్ కౌన్సిలింగ్..!

Spot Counseling : తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో స్పాట్ కౌన్సిలింగ్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల బాలుర కళాశాలలో ఈనెల 28న 2024 – 25 విద్యా సంవత్సరమునకు గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ మరియు బైపిసి మిగిలిపోయిన (ఖాళీగా ఉన్న 27 )సీట్లకు గాను ఈనెల 28న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించబడునని కళాశాల ప్రిన్సిపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అట్టి కౌన్సిలింగ్ లో పాల్గొను విద్యార్థులు మార్చి 2024 తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు నిర్వహించు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో సింగారం కూడలిలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో హాజరు కావాలన్నారు.

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ గ్రూపులో ఎస్సీ 14, ఎస్టి01, ఎస్సీ. సి01, బైపీసీ గ్రూపులో ఎస్సీ 06, ఎస్సీ 01, ఎస్టి02 ఖాళీలు ఉన్నాయన్నారు. విద్యార్థులు టి సి, బోనఫైడ్, కుల ధ్రువీకరణ పత్రము, ఆదాయ ధ్రువ పత్రం, ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని సకాలంలో సింగారం కూడలిలో ఉన్న కళాశాలలో హాజరు కాగలరని కోరారు.

మరిన్ని వివరాలకు ఫోన్ 7995010629 నెంబర్ కు సంప్రదించాలన్నారు.

LATEST UPDATE : 

తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!

తెలంగాణలో 10,594 వీఆర్వోల నియామకం.. నోటిఫికేషన్..!

Rythu Barosa, Runmafi : రైతు భరోసా, పంటల రుణమాఫీ యాప్ తో సమస్యలకు చెక్.. రేపటి నుంచి ఇంటింటికి సర్వే..!

HYDRA : హైడ్రా దూకుడు.. నెక్స్ట్ అనురాగ్..?

 

మరిన్ని వార్తలు