IPL : ఎస్ ఆర్ హెచ్ ఆణిముత్యం నితీష్ కుమార్ రెడ్డి, విజయం వెనుక తండ్రి త్యాగం.. ప్రొఫైల్ చూడండి..!

నితీష్ కుమార్ రెడ్డి.

IPL : ఎస్ ఆర్ హెచ్ ఆణిముత్యం నితీష్ కుమార్ రెడ్డి, విజయం వెనుక తండ్రి త్యాగం.. ప్రొఫైల్ చూడండి..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆణిముత్యంలా యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి నిలిచాడు. పంజాబ్ కింగ్స్ తో మంగళవారం జరిగిన ఎస్ ఆర్ హెచ్ మ్యాచ్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు నితీష్ కుమార్ రెడ్డి. 37 బంతుల్లో నాలుగు ఫోర్లు , ఐదు సిక్స్ లతో 64 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో స్టార్ ఫేసర్ రబడ బౌలింగ్ లో కూడా నితీష్ కుమార్ రెడ్డి సిక్సర్ కొట్టి హైలెట్ గా నిలిచాడు.

ఆయన సంచలన బ్యాటింగ్ తో జట్టు లక్ష్యాన్ని అందించాడు. ఈ సీజన్ లో అసాధారణ బ్యాటింగ్ తో జట్టును ఆదుకున్న నితీష్ కుమార్ రెడ్డి పై క్రికెట్ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అతని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అసలు ఈ నితీష్ కుమార్ రెడ్డి ఎవరు..? అందరిలానే ఆయన కూడా అనేక కష్టాలను దాటుకుంటూ ఈ స్థాయికి చేరాడు. ఆయన ప్రొఫైల్ తెలుసుకుందాం..!

ఉద్యోగం వదిలి తండ్రి త్యాగం :

ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి ఎంతో త్యాగం చేశాడు. కొడుకు కెరీర్ కోసం తన ఉద్యోగమే వదిలేసుకున్నాడు ముత్యాల రెడ్డి. ఇతనిది ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించాడు. వీరిది సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం. నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి హిందుస్థాన్ జింక్ లో ఉద్యోగం చేసేవాడు. నితీష్ కుమార్ ఐదేళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. ప్లాస్టిక్ బంతితో తన ఆటను ప్రారంభించాడు. ఆ తర్వాత తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్ కెరీర్ కు వచ్చాడు. ముత్యాల రెడ్డి ని ఉదయ్ పూర్ ట్రాన్స్ఫర్ చేయడంతో అతను కొడుకు కెరియర్ కోసం ఉద్యోగం మానేసి త్యాగం చేశాడు.

అందరూ తిట్టినా..

ఉద్యోగం మానేశాడని తన తండ్రిని అందరూ తిట్టేవారని, బంధువులు కూడా మందలించేవారని అయినా కూడా ఇక్కడి రాజకీయాలకు భయపడి తన తండ్రి తనను వదిలిపెట్టి వెళ్లలేదని నితీష్ కుమార్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. విశాఖ మైదానంలో ఏర్పాటు చేసిన క్యాంపులకు హాజరైన నితీష్ కుమార్ రెడ్డి మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సాయంతో కడపలోని ఏసీ ఏ అకాడమీలో చేరి మరింతగా ఆట మీద పట్టు సాధించాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్ లో ఓపెనింగ్ చేసిన నితీష్ రెడ్డి మీడియం ఫెసర్ గా సత్తా చాటాడు. ఇండియా అండర్ 19 బి టీంకు ప్రాతినిధ్యం వహించాడు. 2019 – 20 రంజీ సీజన్ లో కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి వచ్చాడు. ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లలో ఒక సెంచరీ, ఆప్ సెంచరీ తో 366 పరుగులు పూర్తి చేశాడు.

20 లక్షలు గత ఏడాది :

సన్ రైజర్స్ అతన్ని 20 లక్షలకు కొనుగోలు చేయగా వచ్చిన డబ్బుతో కారును కొనుగోలు చేశాడు. గత సీజన్లోనే ఐపీఎల్ లో ఉన్నప్పటికీ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ సీజన్ కు ముందుగా నిర్వహించిన ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా సత్తా చాటిన నితీష్ సిఎస్కె తొలి అవకాశం అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో విన్నింగ్ షాట్ కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు. పంజాబ్ కింగ్స్ తో ఆడిన మ్యాచ్ లో అరుదైన షాట్స్ కొట్టి క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా ఆడాడు. ఇప్పుడు అంతా ఆయన గురించి చర్చించుకునేలా చేశాడు.

 

https://www.instagram.com/nitish_kumar_reddy_7?igsh=bmRmcDN3OWI3ZWw=

 

 

ALSO READ : 

Rythu Bharosa New Rules : రైతు భరోసా కొత్త రూల్స్.. రైతులకు హెచ్చరిక..!

Telangana New Ration Cards Process : కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జారీ అప్పటి నుంచే..!

IPL : ఉప్పల్ లో ఉప్పెన.. ఎస్ ఆర్ హెచ్ సరికొత్త రికార్డు..!

Miryalaguda : కాంగ్రెస్ మంత్రులకు అక్రమ వసూళ్లు, దందాలు తప్ప రైతుల గోడు పట్టట్లేదు..!