Annamayya : అంగ రంగ వైభవంగా శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి రథోత్సవం..!
Annamayya : అంగ రంగ వైభవంగా శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి రథోత్సవం..!
రామసముద్రం, మనసాక్షి :
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి ఆలయం నందు రథసప్తమి వేడుకలలో భాగంగా బుధవారం శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి విశేషాలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చారు. అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా కర్ణాటక తమిళనాడు నుంచి స్వామివారిని అనేకమంది భక్తులు దర్శించుకున్నారు.
జనసేనపార్టీ నాయకులు .వివిధ రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులు అధికారులు భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించారు. స్వామి వారి బ్రహ్మ రథోత్సవం ముందు మహిళలు కర్పూర హారతులు పట్టి స్వామివారిని దర్శించుకున్నారు. బలిజ సంఘం నాయకులు ఆలయ ఆవరణములో పెద్ద ఎత్తున గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్వామివారిని దర్శించుకునే విధంగా ఆలయ ప్రధాన అర్చకులు పార్థసారథి బట్టర్, కులశేఖర్ బట్టర్, మల్లిఖార్జున స్వామి మరియు అర్చకులు వివిధ హోమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాస్కర్ గౌడ్, గబ్బూరి సుదర్శన్, గబ్బూరి మధు,దినేష్ కోలాహరి, జనార్ధన్, పూల అంజప్ప, లక్ష్మీపతి, స్టూడియో సీన, బ్యాంకు మంజునాథ్, మంజునాథ్, రమేష్,ప్రకాష్, జనసేన నాయకులు, బలిజ కులస్తులు, స్వామి వారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.









