శ్రీరాముని ఫ్లెక్సీలు చెత్త బండిలో.. హిందు వాహిని ఆందోళన..!

శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో గురువారం దారుణం చోటుచేసుకుంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే రీతిలో వ్యవహరించిన మున్సిపల్ కార్మిక సిబ్బందిపై స్థానిక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, హిందు వాహిని కార్యకర్తలు, వివిధ పార్టీల స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీరాముని ఫ్లెక్సీలు చెత్త బండిలో.. హిందు వాహిని ఆందోళన..!

మున్సిపల్ సిబ్బంది తీరుపై ఆగ్రహించిన నేతలు

శంకర్‌పల్లి చౌరస్తాలో ఆందోళన చేపట్టిన హిందు వాహిని కార్యకర్తలు

ఆందోళన విరమింపచేసిన సీఐ, మున్సిపల్ కమిషనర్

శంకర్‌పల్లి: (మన సాక్షి):

శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో గురువారం దారుణం చోటుచేసుకుంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే రీతిలో వ్యవహరించిన మున్సిపల్ కార్మిక సిబ్బందిపై స్థానిక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, హిందు వాహిని కార్యకర్తలు, వివిధ పార్టీల స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల బాల రాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన పురస్కరించుకొని ఏర్పాటు చేసిన శ్రీరాముని ఫ్లెక్సీలను తొలగించి, చెత్త బండ్లలో తరలించుటను నిరసిస్తూ.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ శంకర్‌పల్లి ప్రధాన చౌరస్తాలో ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

రెండు గంటల పాటు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. స్వచ్ఛందంగా వ్యాపారస్తులు తమ దుకాణాలను కొద్దిసేపు మూసివేశారు. సీఐ వినాయక రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జ్ఞానేశ్వర్ జోక్యంతో ఆందోళనకారులు ధర్నా విరమింపజేశారు. డిటెక్టివ్ సిఐ నాగరాజు, ఎస్ఐలు సంతోష్ రెడ్డి, సత్యనారాయణ ఉన్నారు.

ALSO READ : తెలంగాణ : రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు.. మీ సేవలో చేసుకోవాల్సిందే..!