జిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య
విద్యార్థులకు ముగ్గుల పోటీలు
విద్యార్థులకు ముగ్గుల పోటీలు
మిర్యాలగూడ , మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్ లోని వర్డ్ అండ్ డీడ్ ప్రైమరీ పాఠశాలలో బుధవారం గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థినిలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం పోటీలలో విజేతలను ప్రకటించారు.
విజేతలకు గణతంత్ర దినోత్సవం రోజు బహుమతులు అందజేయనున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ కలీం పేర్కొన్నారు. బహుమతులు పొందిన వారిలో గాయత్రి ,శ్రీజ, ఇందు, కావేరి ఉన్నారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయునిలు హబీబా, జయంతి, నశ్రీన్, సుమలత, అన్నపూర్ణ ,నికిత, కరుణ ,శిల్ప, షబానా, భాను ,ఆసియా, నాజియా, ఫాతిమా, రాజశేఖర్ పాల్గొన్నారు.









