BREAKING : ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ.. దిశా నిర్దేశం చేసిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..!

ఆరోగ్య సమస్యలపై వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వైద్యాధికారులను ఆదేశించారు.

BREAKING : ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ.. దిశా నిర్దేశం చేసిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..!

సూర్యాపేట, మనసాక్షి

ఆరోగ్య సమస్యలపై వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందాలని , ఆసుపత్రిలో రోగులకు మంచి నాణ్యమైన వైద్యం అందాలని, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తదుపరి హాజరు శాతం పతిశీలించి దిశానిర్దేశం చేశారు.

ఆసుపత్రిలో వచ్చిన రోగులను కలెక్టర్ వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఐసీయూలో బెడ్స్, డ్రగ్స్ అలాగే నిరంతరం శానిటేషన్ చేపట్టాలని అలాగే ప్రసూతి కోసం వచ్చే గర్భిణీలకు ఎక్కువగా సాధారణ కాన్పులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆసుపత్రులలో ఎక్కడ కూడా మందుల కొరత లేకుండా చూడాలని అన్నారు.

ఆసుపత్రిలోని జనరల్ క్యాజువాలిటి, ఆర్థో వార్డు లను తనిఖీ చేసి రోగులతో అందుతున్న వైద్యం సేవల గురించి ఆడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అత్యవసరంగా కావలసిన వాటిని ఒక నివేదిక రూపంలో అందజేయాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ నర్వోత్తం, డాక్టర్ నర్సంహ, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Jobs : పదవ తరగతి మార్కులతో ఉద్యోగాలు.. మీరూ దరఖాస్తు చేసుకోండి..!

Free Coaching : సివిల్స్ లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణ.. డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం..!