Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

సూర్యాపేట : మహిళ పథకాల అమలులో దేశం లోనే తెలంగాణ నెంబర్ వన్..!

సూర్యాపేట : మహిళ పథకాల అమలులో దేశం లోనే తెలంగాణ నెంబర్ వన్..!

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

సూర్యాపేట, మన సాక్షి :

మహిళా ఆరోగ్యం , సాధికారత కు ముఖ్యమంత్రి కేసీఅర్ నాయకత్వం లోని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది అని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సూర్యాపేట లోని బాలాజీ ఫంక్షన్ హాల్లో వాసవి – వనిత క్లబ్ ఆధ్వర్యం లో సామూహిక సీమంతాలు కార్యక్రమానికి హాజరై న మంత్రి 104 మంది గర్భిణులకు చీరలు, పండ్లు, పూలు పంపిణీ చేసి ఆశీర్వదించారు.

 

అనంతరం మాట్లాడుతూ కులమత భేదాలు లేకుండా ఇంతమంది పేద మహిళలకు వనిత- వాసవి క్లబ్ ఆధ్వర్యం లోసామూహిక సీమంతాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళా సాధికారత లక్ష్యంగా పలు పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పథకాల అమలులో రాష్ట్రం చాలా ముందుందని అన్నారు.

 

మహిళల హక్కులు, గౌరవాన్ని కాపాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కిట్‌తో ఆడబిడ్డలకు పౌష్టికాహారం అందిస్తూ కుటుంబ వైద్యురాలిగా, కళ్యాణలక్ష్మి కింద ఆడపిల్లల పెళ్లి ఖర్చులు చూసుకుంటూ కుటుంబ పెద్దగా నిలిచారన్నారు . గత తొమ్మిదేళ్లలో 13,90,636 మంది బాలింతలు కేసీఆర్ కిట్ ద్వారా లబ్ధి పొందగా, 6.84 లక్షల మంది గర్భిణులకు కేసీఆర్ పౌష్టికాహార కిట్‌లు అందించారన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా 18,46,635 మంది మహిళలకు లబ్ధి చేకూరిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళా సంక్షేమంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ముఖ్యమంత్రి పాలనలో మహిళలు సుఖసంతోషాలతో జీవిస్తునారని అన్నారు. ఆడబిడ్డలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా మిషన్ భగీరథను , షీ టీమ్ లను ప్రారంభించారు, ఇది నీటి కుండ కోసం చాలా దూరం పాదయాత్రలు చేసే మహిళలకు పెద్ద ఊరటనిచ్చిందన్నారు.

 

MOST READ : 

  1. Phone Charging : ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా..? ఈ పొరపాట్లు చేస్తే పేలిపోతుంది..!
  2. Google Crome : గూగుల్ క్రోమ్ అప్ డేట్ చేసుకోకుంటే ముప్పు తప్పదు.. ఇలా చేసుకోండి..!
  3. Telangana : తెలంగాణ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయాలు..!
  4. Admin Review : కొత్త టూల్స్‌.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల శక్తివంతం ..!
  5. వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!

ఇక ఆడబిడ్డల కోసం ఇటీవల తెచ్చిన ఆరోగ్య మహిళ పథకం వారీ పట్ల ముఖ్యమంత్రి కేసీఅర్ కు ఉన్న ప్రేమ, అభిమానాలకు నిదర్శనం అన్నారు. కార్యక్రమం లో మాజీ మార్కేట్ ఛైర్మన్ ఉప్పల లలితా ఆనంద్, ఉప్పల ఆనంద్, గుండా శ్రీదేవి, రాచకొండ శ్రీనివాస్, చల్లా లక్ష్మీకాంత్, రాచర్ల కమలాకర్, తోట శ్యామ్, లక్ష్మీ, వెంపటి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు