లక్షేట్టిపేట్ : యువకుడు ఆత్మహత్య

లక్షేట్టిపేట్ : యువకుడు ఆత్మహత్య

లక్షేట్టిపేట్ , (మన సాక్షి);

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని శ్రీసత్యసాయి నగర్ కి చెందిన రాథోడ్ శివసాయి అనే 16 సంవత్సరాల యువకుడు మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. కుటుంబీకులు చెప్పిన వివరాల ప్రకారం మృతుడు గత సంవత్సర కాలంగా మద్యానికి బానిస అయ్యాడని.

 

ఇంట్లో వాళ్లు మద్యం మానుకోమని ఎన్నిసార్లు చెప్పినా మద్యం సేవించడం మానుకోలేదని. అంతే కాకుండా మద్యం అలవాటు మానుకోమని చెబితే ఆత్మహత్య చేసుకుని చనిపోతానని బెదిరించేవాడు.

 

గతంలో మద్యం మానుకోమని కుటుంబ సభ్యులు చెబితే ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడగా ఆసుపత్రికి తరలించి బ్రతికించుకున్నారు. అదే క్రమంలో మంగళవారం రాత్రి కూడా అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు.

 

ALSO READ :

RBI : రూ. 2 వేల నోట్ల రద్దు పై ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

PhonePe : ఫోన్ పే లో లోన్లు.. రూ.15 వేల నుంచి రు. 5 లక్షల వరకు..!

 

ఇంట్లో కుటుంబ సభ్యులు మానుకోమని చెప్పగా మనస్థాపం చెంది అందరు పడుకున్న తర్వాత సీలింగ్ ఫ్యాన్ కి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి రామ్ సింగ్ తెలిపారు.

 

ఫిర్యాదు దారుడు చెప్పిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని లక్షెట్టిపేట్ ఎస్ఐ తెలిపారు.