BIG BREAKING : తెలంగాణ సీఎం మార్పు.!
BIG BREAKING : తెలంగాణ సీఎం మార్పు.!
సంచలన ఆరోపణలు చేసిన బి జె ఎల్ పి నేత
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ముఖ్యమంత్రిని మార్చనున్నట్లు బి జె ఎల్ పి నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో సోమవారం ఆయన విలేకరులతో ఇష్ట గోష్టిగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఇప్పటికే తెలంగాణ ఇన్చార్జిని మార్చిందని ఆయన పేర్కొన్నారు. కొత్త కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కు సీఎం ను మార్చాలన్న టాస్క్ ఇచ్చిందని ఆయన సంచలనం వ్యాఖ్యలు చేశారు.
మిషన్ సీఎం చేంజ్ అనే టాస్క్ ను కాంగ్రెస్ నటరాజ్ కు అప్పచెప్పిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ క్యాబినెట్లో కలహాలు ఉన్నాయన్న వార్తలు కథలుగా వినిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తన బతుకు ఆగంలో ఉందని సీఎం రేవంత్ కు అర్థమైంది అన్నారు. మీనాక్షి నటరాజన్ దయాదాక్షిణ్యాల మీదే సీఎం గా రేవంత్ కొనసాగనున్నారని పేర్కొన్నారు. నటరాజన్ సీఎంను మార్చే గ్రౌండ్ ప్రిపరేషన్ లో ఉందన్నారు.
అయితే క్యాబినెట్ లో ఉన్న ఒక మినిస్టర్ ను సీఎం చేయాలని కాంగ్రెస్ హై కమాండ్ చూస్తుందన్నారు. ఇప్పటికే ఉత్తం, పొంగులేటి శాఖలో రేవంత్ కు వేలు పెట్టొద్దని ఆదేశాలు హెకమాండ్ జారీ చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిని మార్చడం వెనుక ఉత్తంకుమార్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఉందని ఆయన ఆరోపణ చేశారు.
MOST READ :
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఎకౌంట్లలో రూ.1లక్ష.. లేటెస్ట్ అప్డేట్..!
-
Suryapet : చేతికొచ్చే పంట.. పశువుల పాలాయె.. అడుగంటిన బోర్లు, ఎండిన పొలాలు..!
-
Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!
-
TG News : తెలంగాణలో విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!









