Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Accident : డివైడర్ ను ఢీ కొట్టిన బైకు.. అక్కడికక్కడే మృతి..!

Accident : డివైడర్ ను ఢీ కొట్టిన బైకు.. అక్కడికక్కడే మృతి..!

కొండమల్లేపల్లి, మనసాక్షి :

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి లో బుధవారం అర్ధరాత్రి బైకు బీభత్సం సృష్టించింది. తిరుమల అజయ్ మృతి చెందారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం లోని కొండమల్లేపల్లి మండలం ధోనియాలా, విజయమెరి స్కూల్ ఎక్స్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

బైకు కంట్రోల్ చేయలేక డివైడర్ ను ఢీకొట్టి అక్కడిఅక్కడే మృతి చెందడం జరిగింది. దేవరకొండ నుంచి మల్లేపల్లి వైపు వెళ్తున్న.. ధోనియాలా, విజయమెరి స్కూల్ ఎక్స్ రోడ్ వద్ద అతివేగంతో డివైడర్ ను ఢీ కొట్టడం జరిగింది . దాంతో తిరుమల అజయ్ అక్కడికక్కడే మృతి చెందినాడు. మృతుడు కి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతుల్లో తిరుమల అజయ్ ( 20), చందంపేట మండలం గాగిల్లపురం గ్రామానికి చెందినవారుగా బంధువులు గుర్తించినారు. ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు