కేసీఆర్ తిరిగి సీఎం కావాలని.. సామాన్యుల సంకల్పం..!
నమ్మి మోసపోయి కాంగ్రెస్ ముసుగులో నాశనకాలాన్ని కొని తెచ్చుకున్న పాపానికి విముక్తి కలగాలంటే, "కేసీఆర్ పాలన కావాలే... కేసీఆర్ మల్లా ముఖ్యమంత్రిగా రావాలే" అనే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతూ... ఆదిలాబాద్ అడవి బిడ్డలు ఎర్రవల్లి బాట పట్టిండ్రు.

కేసీఆర్ తిరిగి సీఎం కావాలని.. సామాన్యుల సంకల్పం..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
నమ్మి మోసపోయి కాంగ్రెస్ ముసుగులో నాశనకాలాన్ని కొని తెచ్చుకున్న పాపానికి విముక్తి కలగాలంటే, “కేసీఆర్ పాలన కావాలే… కేసీఆర్ మల్లా ముఖ్యమంత్రిగా రావాలే” అనే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతూ… ఆదిలాబాద్ అడవి బిడ్డలు ఎర్రవల్లి బాట పట్టిండ్రు.
కేసీఆర్ పట్ల గుండెల్లో నిండిన అభిమానమే గోండు బిడ్డల పాదయాత్రకు కొండంత ధైర్యాన్నిచ్చింది. ఆసిఫాబాద్ నియోజకవర్గం వాంకిడి నుండి దాదాపు 300 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన, కేసీఆర్ అభిమానులు గురువారం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని సాదరంగా ఆహ్వానించి యోగ క్షేమాలు తెలుసుకుని వారి నిస్వార్థ సంకల్పానికి భుజం తట్టి అభినందించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర రావు మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలనే ఏకైక సంకల్పంతో, ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఎర్రవల్లి నివాసం వరకు సుమారు 300 కిలోమీటర్ల మేర పాదయాత్రగా వచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఇద్దరు సామాన్య అభిమానులు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి చెందిన జాడే తిరుపతి (ఆటో డ్రైవర్) దుర్గం శంకర్ (హోటల్ కార్మికుడు) అనే ఇద్దరు గిరిజన ఆదివాసీ బిడ్డలు, కేసీఆర్ పై ఉన్న అపరిమితమైన అభిమానంతో ఈ పాదయాత్ర చేపట్టారు.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సహకారంతో వారికి కేసీఆర్ అపాయింట్‌మెంట్ లభించింది. 11 రోజులుగా రోజుకు సగటున 25 కిలోమీటర్ల చొప్పున కాలినడకన ప్రయాణించి, గురువారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఎలాంటి స్వార్థం లేదా వినతిపత్రాలు లేకుండా, కేవలం “కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి” అనే అంకితభావంతోనే ఈ సుదీర్ఘ ప్రయాణం చేసినట్లు వారు తెలిపారు.
ఈ సందర్భంగా కేసీఆర్ వారిద్దరినీ ఆప్యాయంగా పలకరించి, వారి శ్రమను, అభిమానాన్ని ప్రశంసించారు.
వారిని అభినందిస్తూ, వారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. మళ్ళా మన ప్రభుత్వం వస్తున్నది. అప్పుడు తప్పకుండా నన్ను వచ్చి కలవండి అంటూ వారి భుజం తట్టారు. అనంతరం వారికి వీడ్కోలు పలికిన కేసీఆర్ , వారికి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయగా, తిరిగి సొంత ఊరికి బయలుదేరారు.
MOST READ
- తెలుగు రాష్ట్రాలలో ఈడి సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో తనిఖీలు..!
- Mahabubnagar : మహబూబ్ నగర్ కోర్టు సంచలన తీర్పు.. అత్యాచార నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష..!
- Paddy : రైతులు అలా చేస్తేనే సన్న వడ్లకు ప్రభుత్వ బోనస్..!
- Nalgonda : నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూప రెడ్డి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. హత్య చేసింది విద్యార్థులేనా..?









