కన్నతల్లిని చంపిన కసాయి కొడుకు..!

మద్యం మత్తులో కన్న తల్లిని చంపిన సంఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం తమ్మర బండ పాలెం లో సుందరయ్య కాలనీలో చోటుచేసుకుంది.

కన్నతల్లిని చంపిన కసాయి కొడుకు..!

అనంతగిరి, మన సాక్షి :

మద్యం మత్తులో కన్న తల్లిని చంపిన సంఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం తమ్మర బండ పాలెం లో సుందరయ్య కాలనీలో చోటుచేసుకుంది. అనంతగిరి ఎస్సై అనిల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తమ్మర బండ పాలెం సుందరయ్య కాలనీకి చెందిన పుట్టబంతి వీరేశం గత కొంతకాలంగా మద్యానికి బానిసై తన భార్య శిరీషను శారీరకంగా, మానసికంగా వేధించడం వల్ల పుట్టింటికి వెళ్ళిపోయింది.

ALSO READ : Gruhajyothi : గృహజ్యోతి.. 200 యూనిట్ల ఉచిత విద్యుతుకు బ్రేక్..!

వీరేశం తన తల్లి పుట్ట బంతి రాములమ్మ తో కలిసి తమ్మరలో కిరాయి గది తీసుకొని ఉంటున్నారు. ఈనెల 6వ తేదీన రాత్రి పదిన్నర గంటల సమయంలో పుట్ట బంతి వీరేశం బాగా మద్యం సేవించి మద్యం మత్తులో తన తల్లి రాములమ్మ తో గొడవపడి గొంతు నిలిమి చంపేశాడు. మృతురాలి కూతురు నల్లగొండ రమణ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ALSO READ : అంతా మనవాళ్లే ఎలాగైనా గెలవచ్చనుకుని దరఖాస్తులు.. నల్లగొండ, భునగిరి ఎంపీ టికెట్లకు కాంగ్రెస్ పార్టీలో పరిశీలించే పేర్లు ఇవేనా..?