హాష్‌ అయిల్‌ కలిగి ఉన్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..!

హాష్‌ అయిల్‌  కలిగి ఉన్న ఇద్దిరిని చందానగర్ ‍ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 760 గ్రాముల   హాష్‌ ఆయిల్‌,2 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి  వివరాలను ఇన్‌స్పెక్టర్‌  శ్రీధర్ తెలిపారు.

హాష్‌ అయిల్‌ కలిగి ఉన్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..!

శేరిలింగంపల్లి , మన సాక్షి :
హాష్‌ అయిల్‌  కలిగి ఉన్న ఇద్దిరిని చందానగర్ ‍ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 760 గ్రాముల   హాష్‌ ఆయిల్‌,2 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి  వివరాలను ఇన్‌స్పెక్టర్‌  శ్రీధర్ తెలిపారు.

ఆదివారం రాత్రి లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద  వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి ముగ్గురు  నిందితులు 1 ) నర్మ్నాడ్ ప్రవీణ్ కుమార్(32 ), 2 )వద్దాడి సాయి కుమార్(28), ఆటో దిగి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని పట్టుకొని పోలీసులు తనిఖీ చేయగా వారి వద్ద హాష్‌ ఆయిల్‌ విక్రయిస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో మూడో నిందితుడు రాజారావు పరారీలో ఉన్నాడని ఇన్స్పెక్టర్ తెలిపారు.వీరిని రిమాండ్ కు తరలించామని ఇన్స్పెక్టర్ తెలిపారు.

ALSO READ : BIG BREAKING : సూర్యాపేటలొ బి ఆర్ ఎస్ కు గట్టి దెబ్బ.. ముకుమ్మడి రాజీనామా చేసిన 15 మంది అసమ్మతి కౌన్సిలర్లు..!