Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలువికారాబాద్ జిల్లాహైదరాబాద్

మంజీరా నదిలో నీట మునిగి ఇద్దరు యువకులు మృతి..!

మంజీరా నదిలో నీట మునిగి ఇద్దరు యువకులు మృతి..!

కొల్చారం, మన సాక్షి :

ఏడుపాయల మంజీరా నదిలో నీట మునిగి ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ ఇందిరా నగర్ కాలనీకి చెందిన కృష్ణ (20), శ్యాం కుమార్ (21) లు మూడు రోజుల క్రితం ఏడుపాయల జాతరకు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు.తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఏడుపాయల ఆలయ సమీపంలోని చిన్న ఘనపూర్ మంజీరా నది రెండవ పాయ బ్రిడ్జి వద్ద స్నానానికి వెళ్లారు.

మంజీరా నది రెండవ పాయలో నీటి మడుగులు మునిగిపోవడంతో కృష్ణ , శ్యాం కుమార్ ఇద్దరు నీట మునిగారు. వెంటనే మృతుల బంధువులు మత్స్య శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో గజ ఈత గాళ్ళ సహాయంతో నదిలో గాలించారు. నదిలో కృష్ణ, శ్యామల మృతదేహాలు వెలికి తీశారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్సై మహమ్మద్ గౌస్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

  1. Kamareddy : నడిరోడ్డు పై భార్యను హత్య చేసిన భర్త..!

  2. Mega Job Mela : గందరగోళంగా మెగా జాబ్ మేళా.. వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగులు..!

  3. BIG BREAKING : నేటి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి బ్రేక్.. ఎందుకంటే..!

  4. Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

  5. Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!

మరిన్ని వార్తలు