ప్రాణం ఖరీదు ఒక లక్ష యాభై వేలు..!

ప్రాణం ఖరీదు ఒక లక్ష యాభై వేలు..!

వైద్యం వికటించి యువతి మృతి

డాక్టరే కారణం అంటున్న మృతురాలి బంధువులు

దమ్మపేట , మన సాక్షి :

తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో వైద్యం వికటించి యువతి మృతి చెందిన సంఘటన బుధవారం సాయంత్రం జరిగింది.
ఈ సంఘటనకు సంబంధించి మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి .

 

మండలంలోని అల్లిపల్లి గ్రామానికి చెందిన పాండ్ల నందిని ( 25 ) ఈ నెల 3వ తేదీన తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ స్థానిక భవాని నర్సింగ్ హోమ్ లో వైద్యానికి వచ్చింది. దీనితో నందిని పరీక్షలు చేసిన డాక్టర్ శాంతను కడుపులో కనితి గడ్డలు ఉన్నాయని ఆపరేషన్ చేయాలని తెలిపారు .

 

ఆపరేషన్ కు 60 వేల రూపాయలు ఖర్చు అవుతుందని డిమాండ్ చేశారు. దీనితో మృతురాలి బంధువులు 50 వేలు ఇస్తామని చెప్పి 30 వేల రూపాయలను అడ్వాన్సుగా ఆసుపత్రికి చెల్లించారు. దీనితో డాక్టర్ మృతురాలు నందిని కి ఆపరేషన్ చేసి కనితి గడ్డలను తొలగించాడు.

 

అనంతరం మృతురాలికి తీవ్ర రక్తస్రావం అవడంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం వెళ్లాలని చెప్పి ఆసుపత్రి యాజమాన్యం లో ఒకరిని అంబులెన్స్ ని ఇచ్చి నందిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు . ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు రోజులు వైద్యం పొందిన నందిని పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుండి హైదరాబాదు గాంధీ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ నందిని చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందింది .

 

దీనితో మృతురాలి బంధువులు డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే వైద్యం వికటించి నందిని మృతి చెందిందని శవాన్ని భవాని నర్సింగ్ హోమ్ కు తీసుకువచ్చి గురువారం ఆందోళన చేపట్టారు. కొంతమంది మృతురాలి బంధువులు డాక్టర్ పై ఆగ్రహంతో ఆసుపత్రుల్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు.

 

స్పందించకపోవడంతో శవాన్ని ఆస్పత్రి ముందు ఉంచి ఆందోళన చేపట్టారు. దీనితోపరిస్థితి ఉధృతంగా మారడంతో స్థానిక ఎస్సై హుటా హుటిన ఆసుపత్రికి వచ్చి ఆందోళనకారులతో మాట్లాడి శవాన్ని ఆసుపత్రిముందు రోడ్డుపై నుండి శవాన్ని తీసి వేయించారు .

 

తన నిర్లక్ష్యంగా నందిని మృతి చెందలేదని తీవ్ర రక్తస్రావం కారణంగానే మృతి చెందిందని వైద్యం చేసిన తరువాత నందిని రెండు రోజులపాటు తన అబ్జర్వేషన్ లో ఉంచుకొని పంపించానని అంటున్నాడు . గతంలో కూడా ఈ నర్సింగ్ హోమ్ లో ఇటువంటి సంఘటనలు జరిగాయని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు.

 

ప్రాణం ఖరీదు లక్ష 50 వేల రూపాయలు

 

నిర్లక్ష్యం కారణంగా 25 సంవత్సరాల యువతీని పొట్టన పెట్టుకున్న డాక్టరు శవానికి లక్షన్నర రూపాయలు వెలకట్టినట్లు సమాచారం. ఈ సంఘటన దమ్మపేటలో జరిగింది . ఈ విషయం తెలుసుకున్న మండలంలోని ఆదివాసీలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టడంతో డాక్టర్ కంగుతిని ప్రాణానికి వెలకట్టాడు.

 

ఇటువంటి ఘటనలు పునరావతం కాకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదివాస సంఘ నాయకులు బండారు సూర్యనారాయణ , రావుల శ్రీనివాసరావు తదితరులు డిమాండ్ చేశారు .

 

ALSO READ ;

1. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!

2. Cooking : హోటల్లో వంట మాస్టర్ కానీ.. స్నేహితులతో కలిసి..!

3. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!