Nalgonda : వన మహోత్సవం లక్ష్యం 68 లక్షల 70 వేల మొక్కలు..!
Nalgonda : వన మహోత్సవం లక్ష్యం 68 లక్షల 70 వేల మొక్కలు..!
నల్లగొండ, మన సాక్షి:
వనమహోత్సవం కింద ఈ సంవత్సరం నల్గొండ జిల్లాలో 68 లక్షల 70 వేల 800 మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ తెలిపారు. ఇందుకుగాను ఆయా శాఖలు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. వనమహోత్సవం కింద ఈ సంవత్సరం జిల్లాలో నాటే మొక్కల ఏర్పాట్లపై బుధవారం అయన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
జిల్లాలో నాటనున్న 68 లక్షల 70 వేల 800 మొక్కలలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 39 లక్షల 51,700 లు, వ్యవసాయ శాఖ ద్వారా 7 లక్షల 66 వేలు, ఉద్యాన శాఖ ద్వారా 6 లక్షల 38,000 , మున్సిపాలిటీల ద్వారా 8 లక్షల 20 వేల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు ఆయన తెలిపారు. ఈ సంవత్సరం వనమహోత్సవం కింద “ప్రతి ఒక్కరూ వారి అమ్మగారి పేరు పై ఒక మొక్క నాటుదాం” అనే అంశాన్ని తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి , జడ్పీ ఇన్చార్జి సీఈఓ శ్రీనివాసరావు , వ్యవసాయ అధికారి శ్రవణ్, ఎక్సైజ్ అధికారి సంతోష్ , డీఈవో బిక్షపతి మాట్లాడారు.
MOST READ :
-
Miryalaguda : కరాటే లో గోల్డ్ మెడల్ సాధించిన భువనేశ్వర్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభినందనలు..!
-
TG News : తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. బస్తీ దావఖాన ఆకస్మిక తనిఖీ..!
-
TG News : తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!
-
Viral Video : తిరుపతి సన్నిధిలో అపచారం.. ఇదేం పాడుపని.. వైరల్ వీడియో..!









