వర్షిత హాస్పిటల్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ

వర్షిత హాస్పిటల్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : హాస్పిటల్ చైర్మన్ రాంబాబు

మిర్యాలగూడ, ఆగస్టు 31, మన సాక్షి : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వర్షిత ఎమర్జెన్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ రాంబాబు అన్నారు. బుధవారం వినాయక చవితి పర్వదిన సందర్భంగా వర్షిత హాస్పటల్ ఆధ్వర్యంలో పట్టణంలో మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఆయన వెంట డాక్టర్ రాజశేఖర్ రెడ్డి హాస్పటల్ సిబ్బంది, మిత్ర బృందం, పాల్గొన్నారు.