Vemulapally : కన్నుల పండగగా శివపార్వతుల కళ్యాణం..!

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామములో కాకతీయ కాలం నుండి పేరుగాంచిన శ్రీ పార్వతి రామలింగేశ్వర శివపార్వతుల కళ్యాణం సోమవారం కన్నుల పండుగగా జరిగింది.

Vemulapally : కన్నుల పండగగా శివపార్వతుల కళ్యాణం..!

హోరాహోరీగా సాగిన కబడ్డీ పోటీలు

పాల్గొన్న దేవాలయ చైర్మన్ వెంకటేశ్వర్లు అశోక కుమారి

వేములపల్లి, మన సాక్షి:

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామములో కాకతీయ కాలం నుండి పేరుగాంచిన శ్రీ పార్వతి రామలింగేశ్వర శివపార్వతుల కళ్యాణం సోమవారం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణం లో దేవాలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు అశోక కుమార్ దంపతులు పాల్గొని అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణానికి పట్టు వస్త్రములు సమర్పించారు.

కాగా ఈ కళ్యాణం ప్రత్యేక పూలతో అలంకరించిన శివపార్వతుల కళ్యాణం వేదికలో దేవాలయ పురోహితులు మణిశర్మ ,సతీష్ శర్మ, గ్రామ పురోహితులు సూరి శర్మ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. కళ్యాణంలో దాదాపు జిల్లా నలుమూలల నుండి 5000 మందికి పైగా భక్తులు పాల్గొని అర్చనలు ,అభిషేకాలు నిర్వహించారు. కళ్యాణంలో వందమంది దంపతులు శివపార్వతుల కృపలో పాల్గొని కోరిన కోరికలు తీరాలని మొక్కులను చెల్లించుకున్నారు.

ALSO READ : Telangana : రుణమాఫీ హామీపై నాడు, నేడు అంటూ కేటీఆర్ ట్వీట్..!

భక్తులు ఇరువురు తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం శివపార్వతులను డప్పు వాయిద్యాలతో గ్రామం మొత్తం కలియుగ తిరుగుతూ పల్లకిలో సేవకు తీసుకువెళ్లారు.అదేవిధంగా ఆదివారం నుండి శ్రీపార్వతి రామలింగేశ్వర స్వామి జాతర మూడవరోజు  కబడ్డీ ,కోలాటం, ఎడ్ల పందాలు క్రికెట్ క్రీడా పోటీలు హోరా హోరీగా సాగుతున్నాయి. జిల్లాల నలుమూలల నుంచి వచ్చి పెద్ద ఎత్తున క్రీడాకారులకు దాతల సహకారంతో దేవాలయ పాలకవర్గం అన్నదానం ఏర్పాటు చేశారు.

అంతేకాదు రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడలు, కోలాట ప్రదర్శనలతో శ్రీ రామలింగేశ్వర జాతర జనసంద్రంగా మారింది.ఈ క్రీడలలో  దేవాలయ కమిటీ చైర్మెన్ తాళ్ల వెంకటేశ్వర్లు, సల్కునూరు సహకార సంఘం చైర్మన్ గడ్డం స్ప్రుధర్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పిల్లల సందీప్ నాయుడు ,లిఫ్ట్ 21 చైర్మన్ మిర్యాల బిక్షమయ్య క్రీడాకారులకు పరిచయం వేదికగా నిలిచారు.కబడ్డీ , మహిళా కోలాటం  వద్ద ప్రేక్షకులు పెద్ద ఎత్తున వీక్షించారు.ఈ సందర్బంగా దేవాలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పార్వతి రామలింగేశ్వర స్వామి కల్యాణం వైభవంగా నిర్వహించామని  తెలిపారు.

ALSO READ : Sand: ఇకపై ఇసుక ఫ్రీ.. వారి అవసరాలకు మాత్రమే..!

వివిధ మండలాల నుంచి పెద్దఎత్తున ప్రజా ప్రతినిధులు , భక్తులు తండోపతండాలుగా వచ్చినట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ సహాయ సహకారంతో మునుముందు దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబిసి కోఆర్డినేటర్ దేశబోయిన రవికుమార్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు స్వరాజ్యలక్ష్మి, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు బయ్య సైదులు, ఓ బి సి మండల అధ్యక్షులు కోల పెద్ద సైదులు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల నగేష్, ధర్మకర్తలు వాకిటి బిక్షం , కలమ్మ, పెరుమాండ్ల జోజి ,కొండ వెంకటేశ్వర్లు ముత్యాల యుగంధర్,

ఆమనగల్లు మాజీ సర్పంచ్ ఝాన్సీ ప్రవీణ్, మాజీ దేవాలయ చైర్మన్ వెంకటేష్, మాజీ ఉప సర్పంచ్ కోల సైదులు, లిఫ్టు మాజీ 21 చైర్మన్ కర్పూరం లక్ష్మీనరసయ్య, సల్కునూరు సహకార సంఘం డైరెక్టర్ అనుములపూరి జయసుధ ,కాంగ్రెస్ నాయకులు వల్లంపట్ల అబ్రహం , నార్ల అజయ్, బచ్చు జానయ్య , పెరుమాండ్ల కవిరాజు, వాకిటి ఎల్లయ్య, వంగాల వెంకన్న, వంగాల ఈశ్వర్ , ఎలగపల్లి నరేష్, శ్రీకాంత్ , సతీష్ , సైదులు సాయి, రవి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Murder : ఇద్దరు చిన్నారుల హత్య.. నిందితుడు ఎన్ కౌంటర్..!