నల్లగొండ : రికార్డు స్థాయి ఎండలు..!

నల్లగొండ జిల్లా దేవరకొండ లో భానుడు భగ్గు మంటున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు 48.2 డిగ్రీలు దాటుతుండటంతో ఇండ్ల నుంచి బయటికొచ్చేందుకు జనం జంకుతున్నారు.

నల్లగొండ : రికార్డు స్థాయి ఎండలు..!

దేవరకొండ , మనసాక్షి:

నల్లగొండ జిల్లా దేవరకొండ లో భానుడు భగ్గు మంటున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు 48.2 డిగ్రీలు దాటుతుండటంతో ఇండ్ల నుంచి బయటికొచ్చేందుకు జనం జంకుతున్నారు. వేడిగాలుల తీవ్రత అధికంగా ఉంటోంది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల లోపు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా దేవరకొండ లో గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడించింది. రాష్ట్రంలో జిల్లాలలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరింది.

ALSO READ : Telangana : తెలంగాణ మహిళలకు సర్కార్ శుభవార్త.. ఏకంగా లక్ష రూపాయలు..!

ఎండలో పనిచేయడం, ఆటలాడటం చెప్పులు లేకుండా బయట తిరగడం వంటివి చేయవద్దని చెప్పారు. పార్క్ చేసిన వాహనాల్లోకి పిల్లలు, పెంపుడు జంతువులు వెళ్లకుండా చూడాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో వంటగదికి దూరంగా ఉండటం మంచిదని సూచించారు. మద్యం, చాయ్, కాఫీ, స్వీట్స్, కూల్డ్రింక్స్క దూరంగా ఉండాలని చెప్పారు.

శరీర ఉష్ణోగ్రతలు 40.5 సెంటిగ్రేడ్ కంటే ఎకువగా నమోదవడం, విపరీతమైన చెమట, దాహం వేయడం, మగత, బలహీనత, తలతిప్పడం, కండరాలు పట్టేయం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలని సూచించారు. వడగాల్పుల ప్రభావం అధికంగా కనిపిస్తోంది. జనసంచారం తగ్గి రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అత్యధికంగా దేవరకొండ – 48.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ALSO READ : Climbing Stairs : మీరు ప్రతిరోజు మెట్లు ఎక్కి దిగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే.. కొత్త అధ్యాయంలో నిజాలు..!